Advertisement

  • యంగ్ హీరో నితిన్ రంగ్ దే సినిమా నుంచి కొత్త అప్డేట్

యంగ్ హీరో నితిన్ రంగ్ దే సినిమా నుంచి కొత్త అప్డేట్

By: Sankar Thu, 05 Nov 2020 8:14 PM

యంగ్ హీరో నితిన్ రంగ్ దే సినిమా నుంచి కొత్త అప్డేట్


యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం రంగ్ దే. కీర్తి సురేష్ ఈ సినిమాలో నితిన్ కు జోడీగా నటిస్తుంది. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు.

పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘రంగ్ దే’ ఫస్ట్ లుక్ మరియు నితిన్ మ్యారేజ్ నాడు రిలీజ్ చేసిన స్పెషల్ వీడియోకి మంచి స్పందన వచ్చింది. అయితే ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయాలనీ నిర్మాతలు భావిస్తున్నారని గతకొంతకాలంగా వార్తలు వస్తున్నాయి...

అయితే ఇప్పుడు థియేటర్స్ కు అనుమతి లభించడంతో రంగ్ దే సినిమాను కూడా థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమానుంచి 'ఏమిటో ఇది' లిరికల్ సాంగ్ ప్రీల్యూడ్ ని విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ ప్రీల్యూడ్ వింటుంటే దేవిశ్రీ ప్రసాద్ మరోసారి అద్భుతమైన రొమాంటిక్ ట్యూన్ అందించినట్లు అర్థం అవుతోంది. నవంబర్ 7న లిరికల్ సాంగ్ ను విడుదల చేయనున్నారు.

Tags :
|

Advertisement