Advertisement

  • నితిన్ పెళ్లి సందర్భంగా వైరల్ అవుతున్న నిఖిల్ ట్వీట్

నితిన్ పెళ్లి సందర్భంగా వైరల్ అవుతున్న నిఖిల్ ట్వీట్

By: Sankar Mon, 27 July 2020 4:02 PM

నితిన్ పెళ్లి సందర్భంగా వైరల్ అవుతున్న నిఖిల్ ట్వీట్



టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఒక ఇంటి వాడయ్యాడు ..ఇప్పటికే యువ హీరో నిఖిల్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ..ఇక రానా కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు ..కరోనా మహమ్మారి విలయతాండవం కారణంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలస్‌లోనితిన్ , షాలిని ల వివాహం జరిగింది. ప్రస్తుతం నితిన్- షాలిని మ్యారేజ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా నితిన్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ క్రమంలోనే మరో యంగ్ నిఖిల్ ఆసక్తికర ట్వీట్ పెట్టి ఆకట్టుకున్నారు. నవ దంపతుల ఫోటో షేర్ చేస్తూ.. ''నితిన్ భయ్యా.. కొత్త జర్నీ ప్రారంభించిన నీకు ప్రత్యేక శుభాకాంక్షలు. మీ జోడీ చూడముచ్చటగా ఉంది. జీవితాంతం మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. కాకపోతే నువ్వు పార్టీ బాకీ ఉన్నావ్! నిన్ను వదిలేదే లేదు.. కరోనా తర్వాత పార్టీ చేసుకుందాం'' అని పేర్కొన్నాడు. ఇటీవలే పెళ్లి చేసుకున్న నిఖిల్ కాస్త వెరైటీగా స్పందించడంతో ఈ ట్వీట్ అందరినీ ఆకర్షిస్తోంది.

రోవైపు నితిన్ కూడా తన ప్రేయసి షాలిని తాళి కడుతున్న పిక్స్ షేర్ చేస్తూ.. ''మొత్తానికి ఇంటివాడినయ్యాను. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి'' అని ట్వీట్ చేశారు. ఆదివారం రాత్రి జరిగిన నితిన్ వివాహ వేడుకలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కార్తికేయ హాజరయ్యారు

Tags :
|
|
|

Advertisement