Advertisement

  • "నేచురల్ స్టార్ నాని" మాటలకు ఉబ్బితబ్బిబైన యంగ్ కమెడియన్ "హర్ష"

"నేచురల్ స్టార్ నాని" మాటలకు ఉబ్బితబ్బిబైన యంగ్ కమెడియన్ "హర్ష"

By: chandrasekar Fri, 03 July 2020 2:36 PM

"నేచురల్ స్టార్ నాని" మాటలకు ఉబ్బితబ్బిబైన యంగ్ కమెడియన్ "హర్ష"


కమెడియన్ ‘వైవా’ హర్ష ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. దీనికి కారణం నేచురల్ స్టార్ నాని. ‘వన్ మోర్ సూపర్ స్టార్. ఐ యామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్ష’ అని నాని అనగానే హర్షలో ఆశ్చర్యంతో కూడిన ఆనందం. ‘భానుమతి రామకృష్ణ’ టీం అరుపులు కేకలు.

నవీన్ చంద్ర, సలోని లూథ్రా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భానుమతి రామకృష్ణ’. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో జూలై 3న విడుదలవుతోంది. ఈ చిత్ర ట్రైలర్‌ను ఈరోజు నాని విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘భానుమతి రామకృష్ణ’ టీమ్‌తో నాని ఇంటరాక్ట్ అయ్యారు.

నవీన్ చంద్ర, సలోని, మిగిలిన చిత్ర యూనిట్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే వేసిన ప్రివ్యూ షో నుంచి మంచి టాక్ వస్తోందని నాని అన్నారు. ‘థియేటర్‌లో రిలీజ్ చేసి హిట్ కొడితే అది రెగ్యులర్. మీరు చరిత్ర సృష్టించబోతున్నారు.

కరోనా టైంలో మా సినిమా విడుదలై సూపర్ హిట్ కొట్టిందని మీరు గొప్పగా చెప్పుకోవచ్చు’ అని మూవీ టీంను నాని ఎంకరేజ్ చేశారు. కాగా, నాని ట్విట్టర్ ద్వారా ‘భానుమతి రామకృష్ణ’ ట్రైలర్‌ను విడుదల చేశారు. అయితే, ఈ ట్రైలర్ అంత ఆసక్తికరంగా లేదు. దీన్ని ట్రైలర్ అనే కన్నా సాంగ్ ప్రోమో అంటే బాగుంటుందేమో. ట్రైలర్ విషయంలో సినీ అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు.

యూట్యూబ్‌లో ఈ ట్రైలర్ కింద కామెంట్లు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. కాకపోతే, ఈ సినిమా ట్రైలర్‌ను గతంలో విడుదల చేశారు. కానీ, అప్పటికి ఈ సినిమాను అప్పటికీ ‘ఆహా’లో విడుదల చేయాలని మేకర్స్ అనుకోలేన్నట్టుంది. ఆ ట్రైలర్ చాలా ఆసక్తికంగా ఉంది. ఆ ట్రైలర్ మళ్లీ ఇప్పుడెందుకు అనుకున్నారో ఏమో ఈ చిన్న సాంగ్ చూపించారు.

ఇదిలా ఉంటే, భిన్న మనస్తత్వాలు కలిగి, 30 ఏళ్ల వయసులో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ చిగురించినప్పుడు, ఆ సంఘర్షణను వారు ఎలా ఎదుర్కొన్నారు అనే కథాంశంతో ఈ సినిమా వస్తోంది. ఇందులో భానుమతిగా సలోని లూథ్రా, రామకృష్ణగా నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు.

వైవిధ్యమైన కథనంతో సాగే ఈ సినిమాకు శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించారు. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ అందించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. అచ్చు రాజమణి నేపథ్య సంగీతం అందించారు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ దర్శకుడు రవికాంత్ పెరెపు ఎడిట్ చేశారు.

Tags :
|
|

Advertisement