Advertisement

  • అభిషేక్ అన్నయ్య మీరు , మీ కుటుంబం కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి ..యువ నటుడు అమిత్ సాద్

అభిషేక్ అన్నయ్య మీరు , మీ కుటుంబం కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి ..యువ నటుడు అమిత్ సాద్

By: Sankar Tue, 21 July 2020 12:50 PM

అభిషేక్ అన్నయ్య మీరు , మీ కుటుంబం కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి ..యువ నటుడు అమిత్ సాద్



బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ , అయన కొడుకు అభిషేక్ బచ్చన్ , కోడలు ఐశ్వర్య రాయి బచ్చన్ , మనవరాలు ఆరాధ్య కరోనా బారిన పడిన విషయం తెలిసిందే ..దీనితో దేశ వ్యాప్తంగా అనేక మంది బచ్చన్ ఫామిలీ కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోని తిరిగి రావాలని ఆకాంక్షించారు ..తాజాగా వీరు త్వ‌ర‌గా కోలుకోవాలంటూ "బ్రీత్" న‌టుడు అమిత్ సాధ్ ఆకాంక్షించారు. ఈమేర‌కు సోమ‌వారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు..

అన్న‌య్య(అబిషేక్‌)‌.. మిమ్మ‌ల్ని గురు, యువ‌, బంటీ, బ‌బ్లీ.. ఇలా ఎన్నో సినిమాల నుంచి ద‌గ్గ‌రగా చూస్తున్నాను. ముందుగా నాకు సీనియ‌ర్‌గా ఉన్నందుకు కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకుంటున్నాను. న‌న్ను మీతో స‌మానంగా చూశారు. మీరు ఎక్కువ, నేను త‌క్కువ అనే భావ‌న నాకు రాకుండా చేశారు. మీరు లేక‌పోయుంటే బ్రీత్‌లో నా పాత్ర క‌బీర్ సావంత్ అసంపూర్తిగా మిగిలిపోయేది. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించ‌కుండా బ్రీత్ విజ‌య వేడుకకు ఆరంభం, ముగింపు ఏదీ ఉండ‌దు. న‌న్ను ఎప్పుడూ ప్రేరేపిస్తూ ఉండే మీతో క‌లిసి ప‌నిచేసేందుకు నేను ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను".

మీరు, మీ కుటుంబం ఎంతో త్వ‌ర‌గా క‌రోనాను జ‌యించాల‌ని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. అప్పుడు ఎంచ‌క్కా మిమ్మ‌ల్ని క‌లుసుకోవ‌చ్చు, మీకు గ‌ట్టిగా ఒక హ‌గ్ కూడా ఇవ్వొ‌చ్చు. అలా ఐతే న‌న్ను 2 వారాలు క్వారంటైన్‌లో ఉండ‌మంటారేమో? రెండు వారాలేంటి, నెల రోజులైనా ఉంటాను. అంత ప్రేమ నాకు మీమీద‌! మిమ్మ‌ల్ని చూసే క్ష‌ణం కోసం ఎదురు చూస్తూ ఉంటా" అని రాసుకొచ్చారు.

Tags :
|
|
|
|

Advertisement