Advertisement

  • షూటింగ్ ప్రారంభించబోతున్న కేజిఎఫ్ 2..ఆనందంలో అభిమానులు

షూటింగ్ ప్రారంభించబోతున్న కేజిఎఫ్ 2..ఆనందంలో అభిమానులు

By: Sankar Fri, 21 Aug 2020 10:20 PM

షూటింగ్ ప్రారంభించబోతున్న కేజిఎఫ్ 2..ఆనందంలో అభిమానులు


కన్నడ ఇండస్ట్రీ లో అల్ టైం గ్రేట్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన సినిమా కెజిఎఫ్ ..ఒక్కసారిగా కన్నడ సినిమా గురించి దేశవ్యాప్తంగా తెలిసేలా చేసిన సినిమా కెజిఎఫ్..పాన్‌ ఇండియా చిత్రంగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు. దీంతో దీని సీక్వెల్‌ను తెరకెక్కించాలని చిత్ర యూనిట్‌ నిర్ణయించింది. భారీ అంచనాలతో దీనిని నిర్మిస్తున్నారు.

అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. తిరిగి ఆగస్టు 26 నుంచి ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. బెంగుళూరులోని కంఠీవ స్టూడియోలో షూటింగ్‌ మొదలు కానుంది. దీని కోసం దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ , ఇతర కీలకమైన యూనిట్‌ సభ్యులతో కలిసి లోకేషన్‌ రెక్కీ నిర్వహించారు. 26 నుంచి జరిగే బ్యాలెన్స్‌ షూటింగ్‌లో ప్రకాశ్‌ రాజ్‌, మాళవిక తదితరులు పాల్గొననున్నారు.

దీంతో కేజీఎఫ్‌ ఛాప్టర్‌-2 బ్యాలెన్స్‌ షూటింగ్‌ ఎప్పుడు పూర్తవుతుందా, ఎప్పుడు విడుదలవుతుందా అని దేశ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది మంచి శుభవార్త కానుంది. ఈ సినిమాలో అధీర పాత్రలో సంజయ్‌ దత్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సంజయ్ దత్ కాన్సర్ భారిన పడటంతో ఇక ఇప్పట్లో కెజిఎఫ్ 2 షూటింగ్ ఉండదేమో అని అభిమానులు భావించారు.అయితే షూటింగ్ ప్రారంభం అవుతుండటంతో అభిమానులు ఆనందంలో ఉన్నారు

Tags :
|

Advertisement