Advertisement

  • మీ నాన్న లేకపోతే నువ్వు జీరో... హీరోయిన్ హర్ట్

మీ నాన్న లేకపోతే నువ్వు జీరో... హీరోయిన్ హర్ట్

By: Anji Sun, 20 Sept 2020 10:48 AM

మీ నాన్న లేకపోతే నువ్వు జీరో... హీరోయిన్ హర్ట్

బాలీవుడ్లో పెద్దగా నటనలో పేరు తెచ్చుకోకపోయినా, కేవలం ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌ కారణంగా అవకాశాలు అందుకుంటున్న సోనాక్షి సిన్హా, సోనమ్ కపూర్ లాంటి వాళ్లకు సోషల్ మీడియా హీట్ మామూలుగా లేదు. మామూలుగానే సోనమ్‌ను సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తుంటారు.

ఈ మధ్య అది మరీ ఎక్కువైంది. హేట్ కామెంట్లతో ఆమెను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. తాజాగా ఒక మహిళ తనను, తన భర్తను ఉద్దేశించి దారుణమైన కామెంట్లు చేసిందంటూ సోనమ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ట్వీట్‌ను షేర్ చేసి.. ఆమెపై తన ఆగ్రహాన్ని చూపించింది. ఇంతకీ సోనమ్‌కు ఆ మహిళ పెట్టిన ట్వీట్‌లో ఏముందంటే..

‘‘మీ నాన్న లేకపోతే నువ్వు జీరో. నీకు నటించడం రాదు. నీ కుటుంబ నేపథ్యం వల్లే నువ్వు కొన్ని సినిమాలు చేయగలిగావు. నీలాంటి వాళ్లు సమాజంలో నెగిటివిటీనీ వ్యాప్తి చేశారు. నీలాంటి మహిళకు భారత్‌తోపాటు ఈ ప్రపంచం ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం సంతోషకరం. నీ భర్త చాలా అందంగా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావేమో. మరోసారి ఆయణ్ని చూడు. ఎంత అందవిహీనంగా ఉన్నాడో తెలుస్తుంది’’ అని ఆ మహిళ కామెంట్ చేసింది.

sonam kapoor,sonam kapoor comment on sushant singh rajput,sonam kapoor interview,sonam kapoor hateful comments,sonam kapoor on sushant singh rajput,sonam kapoor on vikas bahl,sonam kapoor on kangana ranaut,kangana ranaut angry on sonam kapoor,sonam kapoors bitchy comment on aishwarya rais purple lips,sonam kapoor fashion,sonam kapoor ahuja,sonam kapoor instagram,sonam kapoor movies,sonam kapoor outfit,sonam kapoor reaction on kangana ranaut vikas bahl,sonam kapoor trolled,sonam kapoor nepotism,women sensational comments on bollywood actress sonam kapoor

దీనికి సోనమ్ బదులిస్తూ.. ‘‘ఈ మహిళ నాకు నీచమైన మెసేజ్ పంపింది. ఇలాంటి మెసేజ్‌ల ద్వారా ఫాలోవర్లను సంపాదించాలి అనుకుంటోంది. నా దృష్టిలో పడడానికే నువ్వు ఈ మెసేజ్ పంపావని తెలుసు. ఆమె వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి. ఇంత ద్వేషం మనసులో ఉంటే అది వాళ్లనే నాశనం చేస్తుంది’’ అని పేర్కొంది. అయితే సదరు మహిళ ఈ మెసేజ్‌కు స్పందిస్తూ.. తన అకౌంట్ హ్యాక్ అయిందని, తానెప్పుడూ ఇలాంటి హేట్ మెసేజ్‌లు పంపనని పేర్కొడం గమనార్హం.

Tags :

Advertisement