Advertisement

  • బాలకృష్ణ లేకుండా సినీ పరిశ్రమ లేదు ..తమ్మారెడ్డి భరద్వాజ

బాలకృష్ణ లేకుండా సినీ పరిశ్రమ లేదు ..తమ్మారెడ్డి భరద్వాజ

By: Sankar Fri, 29 May 2020 4:20 PM

బాలకృష్ణ లేకుండా సినీ పరిశ్రమ లేదు ..తమ్మారెడ్డి భరద్వాజ

సినిమా ఇండస్ట్రీ పెద్దలు తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో జరిపిన మీటింగ్ పై అగ్ర హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్నే లేపుతున్నాయి ..బాలయ్య వ్యాఖ్యలకు కౌంటర్ గా నాగబాబు కూడా వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత పెద్దది అయింది ..

దీనిపై సీనియర్ దర్శకుడు , నిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ,ఎవరి ఇంట్లో పెళ్లి కాదు, బొట్టు పెట్టి పిలవడానికి. పలానా వాళ్లని పిలవాలి అనేది లేదు నన్ను కూడా పిలవలేదు. ఈ విషయాన్ని ఇంత పెద్ద వివాదం చేయాల్సిన అవసరం లేదు. మహేశ్‌, వెంకటేశ్‌, ఇలా చాలా మందిని పిలువలేదు. మమ్మల్ని పిలవలేదు అంటే అర్థం లేదు. బాలకృష్ణ, నాగబాబు వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం. ఆ వ్యాఖ్యలతో చిత్రపరిశ్రమకు సంబంధంలేదు. ఇప్పటివరకు నిర్మాతలుగా మేము చిత్రీకరణ కోసం ప్రభుత్వంతో సంప్రదిస్తున్నాము. ఈ సమావేశానికి చిరంజీవి, నాగార్జునలను లీడ్‌ తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. బాలయ్య లేకుండా సినీ ఇండస్ట్రీ ఉందనుకోవడం లేదు. ఆయన అవసరం ఉన్నప్పుడు తప్పకుండా పిలుస్తాం’ అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.

ప్రభుత్వంతో సినీ పెద్దలు జరిపిన సమావేశం రియల్‌ఎస్టేట్‌ సమావేశం అని ఎందుకు అన్నారో తెలియదు. అయితే బాలయ్య ఆలా అన్సాలింది కాదు. సమావేశానికి చిరంజీవి, నాగార్జునలను లీడ్‌ చేయమని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఆందుకే వాళ్లు సమావేశానికి వచ్చారు. ఇప్పటివరకు నిర్మాతలు, దర్శకులు మాట్లాడుకునే సమావేశాలే జరిగాయి’ అని సి .కళ్యాణ్ అన్నారు

Tags :

Advertisement