Advertisement

  • ట్విటర్‌ ద్వారా అభిమానులతో ముచ్చటించిన ప్రణీత

ట్విటర్‌ ద్వారా అభిమానులతో ముచ్చటించిన ప్రణీత

By: chandrasekar Tue, 07 July 2020 5:02 PM

ట్విటర్‌ ద్వారా అభిమానులతో ముచ్చటించిన ప్రణీత


తెలుగులో పవన్‌కల్యాణ్‌ తన అభిమాన నటుడని, హ్యాండ్‌సమ్‌ హీరో మహేష్‌బాబు అని అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ డ్యాన్సులను అమితంగా ఇష్టపడతానని అంటోంది కన్నడ సొగసరి ప్రణీత.

ఆదివారం ట్విటర్‌ ద్వారా అభిమానులతో ముచ్చటించిన ప్రణీత వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ప్రణీత మాట్లాడుతూ ‘కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు జరుగుతున్న సమరంలో ప్రతి ఒక్కరూ అవిశ్రాంతంగా పోరాడాలి.

ఆ ఆలోచనతోనే స్వీయస్ఫూర్తితో లాక్‌డౌన్‌ టైమ్‌లో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. మార్పు మాత్రమే శాశ్వతమని, వాటికి తగినట్లుగా జీవితాల్ని మలచుకోవడం ముఖ్యమనే సత్యాన్ని ఈ విరామం నుంచి నేర్చుకున్నా. అమ్మనాన్నలు నన్ను డాక్టర్‌గా చూడాలని కలలు కన్నారు. యాక్టర్‌గా మారడంతో కొంత నిరూత్సాహపడ్డారు.

అయితే నటిగా నేను సాధించిన విజయాల పట్ల వారు గర్వపడుతున్నారు. కరోనా వల్ల విహారయాత్రల్ని మిస్సవుతున్నా. వైరస్‌ అంతమైన వెంటనే విమానం ఎక్కేసి ఇష్టమైన ప్రదేశాలన్నీ చుట్టేస్తా. కాలచక్రంలో వెనక్కి వెళ్లే అవకాశం వస్తే చైనీయుల్ని శాకాహారులుగా మార్చేస్తాను.

స్నేహితులు, కుటుంబసభ్యులంతా ముద్దుగా తనను ‘పరి’ అని పిలుస్తుంటారు. రొమాంటిక్‌ కామెడీ నా ఫేవరేట్‌ జోనర్‌. ఆ సినిమా చూడటం, నటించడం ఇష్టం. ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో నేను చేసిన భరతనాట్యం సన్నివేశం నా కెరీర్‌లోనే అత్యంత ఇష్టమైనది’ సీన్ అని చెప్పింది.

Tags :
|
|

Advertisement