Advertisement

  • ఆ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ బిగ్ బాస్ 4 విన్నర్ కాబోతుందా..?

ఆ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ బిగ్ బాస్ 4 విన్నర్ కాబోతుందా..?

By: Anji Sun, 27 Sept 2020 3:04 PM

ఆ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ బిగ్ బాస్ 4 విన్నర్ కాబోతుందా..?

మూడు వారాల క్రితం గ్రాండ్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ప్రారంభమైన సంగతి విదితమే. తొలివారం పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ షో రెండోవారం నుంచి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో సక్సెస్ అయింది. తొలి, రెండవ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ప్రేక్షకులకు పెద్దగా కిక్ ఇవ్వకపోయినా మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్వాతి దీక్షిత్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. చూపులతోనే స్వాతి అభిమానులను కట్టిపడేస్తోంది.

గ్లామర్ డాల్ లా కనిపిస్తున్న స్వాతి అందానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నెటిజన్లు సైతం స్వాతి దీక్షిత్ రాకతో షోకు కొత్త కళ వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. క్యూట్ గా ఉన్న హీరోయిన్ కావడంతో హౌస్ లోని మేల్ కంటెస్టెంట్లు సైతం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా ఆమెను మెప్పించడానికి పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. కవితలు, పాటలతో ఆమెను మెప్పించడానికి మేల్ కంటెస్టెంట్లు చేసిన ప్రయత్నాలు భలేగా అనిపించాయి.

అఖిల్ నర్మద బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిందంటూ "నాలోనె పొంగెను నర్మద" పాట పాడిన విధానం కానీ అమ్మ రాజశేఖర్ మాస్టర్ బొమ్మకు ప్రాణం పోస్తే స్వాతిలా ఉంటుందని ఇచ్చిన కాంప్లిమెంట్ కానీ స్వాతికి కరెక్ట్ గా సూట్ అవుతాయి. ఈ సీజన్ లో మిగతా కంటెస్టంట్లతో పోలిస్తే తొలి ఇంప్రెషన్ తోనే స్వాతి మంచి ఇంప్రెషన్ కొట్టేసింది. దీంతో స్వాతినే ఈ సీజన్ విన్నార్ కావచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Advertisement