Advertisement

  • పవన్ కళ్యాణ్ అనుకున్నది ఒకటి అయినది ఒక్కటి...

పవన్ కళ్యాణ్ అనుకున్నది ఒకటి అయినది ఒక్కటి...

By: chandrasekar Tue, 17 Nov 2020 11:21 AM

పవన్ కళ్యాణ్ అనుకున్నది ఒకటి అయినది ఒక్కటి...


2020లో వరుస సినిమాలు చేసేద్దాం అనుకున్నాడు. రాజకీయంగా ఒక రకమైన స్తబ్దత ఉండటంతో ఇప్పుడు అక్కడ ఆయన చేసేది ఏమీ లేదు. 2024 ఎన్నికల కోసం సిద్ధం కావడం తప్ప. ఈ గ్యాప్ వరస సినిమాలతో భర్తీ చేయాలని అనుకున్నాడు. అందుకే అరడజను సినిమాలు ఒప్పుకున్నాడు పవన్ కళ్యాణ్. అందులో ఏది ఎప్పుడు విడుదలవుతుందో చెప్పటం కూడా కష్టమే. ప్రస్తుతానికి ఆయన నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా మాత్రమే అనుకున్న టైమ్ కి వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పుడు దానిపై కూడా నీళ్ళు పోశాడు నిర్మాత దిల్ రాజు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం వకీల్ సాబ్ అనుకున్న టైంకి రావడం అసాధ్యం. 7 నెలల గ్యాప్ తర్వాత మధ్య షూటింగ్ మళ్ళీ మొదలైంది. పవన్ కళ్యాణ్ కూడా అక్టోబర్ చివరి వారం నుంచి షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తి చేశాడు దర్శకుడు వేణు శ్రీరామ్. మిగిలిన కాస్త కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తారని ముందు నుంచి ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పుడు నిర్ణయం మారిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సంక్రాంతి రేసు నుంచి పవన్ కళ్యాణ్ పక్కకు తప్పుకున్నాడు. షూటింగ్ లో ఇంకా బ్యాలెన్స్ వర్క్ ఉండటం..పోస్ట్ ప్రొడక్షన్ పెండింగ్ లో ఉండటం వల్ల సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నాడు వకీల్ సాబ్. డిసెంబర్ లో థియేటర్ లో ఓపెన్ అవుతున్నా కూడా సంక్రాంతి నాటికి పరిస్థితులు చక్కబడతాయని అందరూ అంచనా వేస్తున్నారు. అందుకే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, క్రాక్, రెడ్, అరణ్య, రంగ్ దే లాంటి సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయి. కానీ ఎన్ని సినిమాలు వచ్చినా అభిమానులు వేచి వస్తుంది మాత్రం పవన్ కళ్యాణ్ కోసమే. ఇప్పుడు ఆయన మరోసారి హ్యాండ్ ఇచ్చాడు. మార్చిలో ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత కరోనా కూడా ఒక కొలిక్కి వచ్చిన తర్వాత వకీల్ సాబ్ ను రంగంలోకి దించాలని భావిస్తున్నాడు నిర్మాత దిల్ రాజు.మరోవైపు క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న సినిమా 2022లో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, సాగర్ కే చంద్ర సినిమాలు ఎప్పుడు వస్తాయనేది ఇప్పుడే చెప్పలేం.

Tags :
|

Advertisement