Advertisement

  • టెలివిజన్ ఇండస్ట్రీలోకి స్వాగతం' కామెంట్ కి క్లారిటీ ఇచ్చిన రేణు

టెలివిజన్ ఇండస్ట్రీలోకి స్వాగతం' కామెంట్ కి క్లారిటీ ఇచ్చిన రేణు

By: chandrasekar Wed, 14 Oct 2020 4:33 PM

టెలివిజన్ ఇండస్ట్రీలోకి స్వాగతం' కామెంట్ కి క్లారిటీ ఇచ్చిన రేణు


ప్రముఖ సినీ నటి, డైరెక్టర్, ప్రొడ్యూసర్ రేణు దేశాయ్ ఈ మధ్య జీ తెలుగు ఎంటర్టెయిన్మెంట్ లీగ్ 2020 లో పాల్గొంది. ఈ షోకి సంబంధించిన ఒక ప్రోమోని రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ఈ షో గత ఆదివారం సాయంత్రం 5 గంటలకు జీ తెలుగులో ప్రసారం అయింది. 'ఈ షోలో నేను పాట పాడటం, డ్యాన్సు వేయడం, కడుపుబ్బా నవ్వడం చూడొచ్చు' అని రేణు దేశాయ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ పోస్టుకి ఒక అభిమాని స్పందిస్తూ.. 'టెలివిజన్ ఇండస్ట్రీలోకి స్వాగతం' అని కామెంట్ చేయగా ఆ కామెంట్‌కి రేణు దేశాయ్ స్పందిస్తూ 'ఈ షోకి కేవలం గెస్ట్ జడ్జిగా మాత్రమే వచ్చాను, ఏ సీరియల్‌కి సైన్ చేయలేదు' అని సమాధానం ఇచ్చింది.

'మీరు టీవీలో గెస్ట్ జడ్జిగా కనిపించినా చాలు మాకు' అని ఆ అభిమాని పేర్కొన్నారు. ఆ షోలో రేణు దేశాయ్ జాని సినిమాలోని 'ఈ రేయి తీయనిది' అనే పాటతో ఎంట్రీ ఇచ్చింది. కరోనా లాక్‌డౌన్ తరువాత తిరిగి టివి సీరియల్స్ ప్రారంభించడానికి ముందు 'జీ తెలుగు వినోదానికి ఆహ్వానం' అనే క్యాంపెయిన్‌లో కూడా రేణు దేశాయ్ పాల్గొంది. ప్రస్తుతం రేణు దేశాయ్ డైరెక్టర్‌గా తెలుగులో అన్నదాతల ఇబ్బందులపై సినిమాను తెరపైకి తెస్తున్నారు.

Tags :

Advertisement