Advertisement

  • జగన్ తో చర్చలకు బాలయ్యను ఆహ్వానించాము ..కానీ రానన్నాడు ..c. కళ్యాణ్

జగన్ తో చర్చలకు బాలయ్యను ఆహ్వానించాము ..కానీ రానన్నాడు ..c. కళ్యాణ్

By: Sankar Sat, 06 June 2020 5:31 PM

జగన్ తో చర్చలకు బాలయ్యను ఆహ్వానించాము ..కానీ రానన్నాడు ..c. కళ్యాణ్

కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి ఎక్కడ సినిమాలు అక్కడే నిలిచిపోయాయి ..దాదాపు రెండు నెలలు దాటినప్పటికీ ఇంకా షూటింగ్స్ విషయమై ఎటువంటి సమాచారం లేదు ..దీనితో ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు కొంత మంది చిరంజీవి అధ్యక్షతన రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారు ..మొదటగా తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరపగా వారి నుంచి సానుకూల సమాధానమే వచ్చింది ..అయితే ఆ చర్చలకు తనను ఎవరు పిలవలేదు అని ఇండస్ట్రీ లో అగ్ర నటులలో ఒకడైన బాలయ్య బాబు బహిరంగంగానే విమర్శించాడు...ఈ విషయం లో ఇండస్ట్రీ లో పెద్ద దుమారమే లేసింది ..

jagan,balayya,chiranjeevi,kalyan,tollywood ,జగన్,  బాలయ్య, c.కళ్యాణ్ ,  చిరంజీవి,  తెలంగాణ ప్రభుత్వం

అయితే టాలీవుడ్ తాజా పరిస్థితులపై చర్చించేందుకు ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యేందుకు సినీ పెద్దలు సిద్ధం కావడం మరిన్ని చర్చలకు దారితీసింది. జూన్ 9వ తేదీన జరగనున్న ఈ సమావేశానికైనా బాలకృష్ణను పిలుస్తారా? పిలిస్తే ఆయన వస్తారా? అనే దానిపై అంతా దృష్టి సారించారు. అయితే తాజా సమాచారం జగన్‌తో భేటీకి బాలకృష్ణకు ఆహ్వానం అందిందట. కానీ బాలయ్య మాత్రం తాను రాలేనని తేల్చిచెబుతూ అందుకు కారణాలు వివరించారని నిర్మాత సీ కళ్యాణ్ మీడియాకు చెప్పారు.

జూన్ 9న సీఎం జగన్‌తో జరగబోయే భేటీకి రావాలని తానే స్వయంగా బాలయ్యకు ఫోన్ చేసి ఆహ్వానించానని, అయితే అదే సమయంలో తన బర్త్ డే సెలబ్రేషన్ పనులు ఉండటంతో ఆయన రాలేనని చెప్పారని నిర్మాత సీ కళ్యాణ్ అన్నారు. తెలుగు చిత్రసీమ రెండు వర్గాలుగా విడిపోయిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇండస్ట్రీ కోసం బాలకృష్ణ ఎప్పుడూ ముందుంటారని ఆయన పేర్కొన్నారు.


Tags :
|
|

Advertisement