Advertisement

  • పవన్ కళ్యాణ్ మానవత్వాన్ని చూసి ఆశ్చర్యపోయాం.. వేణు శ్రీరామ్

పవన్ కళ్యాణ్ మానవత్వాన్ని చూసి ఆశ్చర్యపోయాం.. వేణు శ్రీరామ్

By: Sankar Mon, 08 June 2020 8:41 PM

పవన్ కళ్యాణ్ మానవత్వాన్ని చూసి ఆశ్చర్యపోయాం.. వేణు శ్రీరామ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి అనేక మంది అనేక సార్లు బహిరంగంగానే చెప్పారు..తాజాగా డైరెక్టర్ వేణు శ్రీరామ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మానవత్వం చూసి తాను ఆశ్చర్యపోయాను అని అన్నాడు.. రెండేళ్ల విరామం తరవాత మళ్లీ పవన్ ముఖానికి మేకప్ వేసుకున్నారు. వరుసపెట్టి సినిమాలు అంగీకరించారు. మొదటిగా ఆయన ‘వకీల్ సాబ్’ సినిమాను పూర్తి చేస్తున్నారు. ఇది చివరి దశకు చేరుకుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం షూటింగ్‌లకు, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతి ఇచ్చింది కాబట్టి త్వరలోనే ‘వకీల్ సాబ్’ ఫైనల్ కాపీ సిద్ధమైపోతుంది. నిజానికి ఈ సినిమా మే నెలలో విడుదల కావాల్సింది. లాక్‌డౌన్ కారణంగా కుదరలేదు.

కరోనా కారణంగా ‘వకీల్ సాబ్’ సినిమా విడుదల ఆలస్యం కావడంపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే తీవ్ర నిరాశతో ఉన్నారు. ఈ కరోనా మహమ్మారి పోయి థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా.. తమ హీరోని ఎప్పుడు తెర మీద చూద్దామా అని ఫ్యాన్స్ చూస్తున్నారు. అయితే, ‘వకీల్ సాబ్’ దర్శకుడు వేణు శ్రీరామ్.. పవన్ ఫ్యాన్స్‌‌ను ఉత్సాహపరిచే కొన్ని విషయాలను పంచుకున్నారు. పవన్‌తో తన వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను చెప్పారు. ఈ మేరకు వేణు శ్రీరామ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

గట్టి సోషల్ మెసేజ్‌తో కూడిన ‘వకీల్ సాబ్’ లాంటి సినిమాను ఒక కమర్షియల్ స్టార్‌తో తీయడం చాలా కష్టమైన విషయం. ఇలాంటి శక్తివంతమైన కథను చెప్పడానికి కచ్చితంగా పవన్ కళ్యాణే సరైన వ్యక్తి. ఈ సినిమా కోసం నా సాయశక్తులా శ్రమించాను. ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఆయన చాలా మంచి వ్యక్తి. సెట్స్‌లో ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఆయన చూపించే మానవత్వాన్ని చూసి ఆశ్చర్యపోయాం’’ అని వేణు శ్రీరామ్ వెల్లడించారు.


Tags :
|

Advertisement