Advertisement

  • తమిళ బుల్లితెర నటి చిత్ర ఆత్మహత్య కేసు ..కాబోయే అల్లుడే చంపాడు అంటున్న చిత్ర తల్లి

తమిళ బుల్లితెర నటి చిత్ర ఆత్మహత్య కేసు ..కాబోయే అల్లుడే చంపాడు అంటున్న చిత్ర తల్లి

By: Sankar Thu, 10 Dec 2020 10:11 PM

తమిళ బుల్లితెర నటి చిత్ర ఆత్మహత్య కేసు ..కాబోయే అల్లుడే చంపాడు అంటున్న చిత్ర తల్లి


తమిళ సినీ ఇండస్ట్రీ లో సంచలనమ్ రేపిన బుల్లితెర నటి విజె చిత్ర ఆత్మహత్య కేసులో చిత్ర తల్లి కాబోయే అల్లుడే చిత్రను హత్య చేసి ఆత్మహత్యగా సృష్టిస్తున్నాడు అని సంచలన ఆరోపణలు చేసింది..

నిన్నమొన్నటి వరకు బుల్లితెరపై కనపించిన ఈమె ఇలా ఉన్నట్లుండి ప్రాణాలు కోల్పోవడం.. అందులోనూ సూసైడ్ చేసుకోవడం తట్టుకోలేకపోతున్నారు. ఈమె మరణించి రెండు రోజులు కావొస్తున్నా ఇప్పటికీ మిస్టరీ మాత్రం వీడడం లేదు. మరోవైపు పోలీసులు మాత్రం ఈమె ఉరి వేసుకోవడం వల్లే చనిపోయిందని క్లారిటీ ఇచ్చారు. ఆత్మహత్య చేసుకుందని.. హత్య అని చెప్పడానికి ఆనవాళ్లు ఏం లేవని చెన్నై పోలీసులు చెప్తున్నారు.

కానీ చిత్ర తల్లి విజయ మాత్రం ఈ వాదన అబద్ధం అంటున్నది. పోలీసులు చెప్తున్న దాన్ని తాను నమ్మనని చెప్తుంది విజయ.చనిపోవడానికి ముందు రోజు రాత్రి కూడా తాను షూటింగ్‌లో ఉన్నాను.. రావడానికి లేట్ అవుతుందని చెప్పిందని తెలిపింది. అంతలోనే ఉదయం హేమంత్ ఫోన్ చేసి మీ కూతురు చనిపోయిందని చెప్పాడని.. అదెలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తుంది చిత్ర తల్లి ..

Tags :
|
|

Advertisement