Advertisement

మెగాస్టార్ సినిమాలో లేడీ సూపర్ స్టార్ ....?.

By: Sankar Mon, 25 May 2020 11:17 AM

మెగాస్టార్ సినిమాలో లేడీ సూపర్ స్టార్ ....?.

మెగాస్టార్ చిరంజీవి , లేడీ అమితాబ్ విజయశాంతి కాంబినేషన్కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ..ఎన్నో హిట్ సినిమాలతో తెలుగు అభిమానులను అలరించారు ..విజయ శాంతి , చిరంజీవితో పాటు సమానంగా డాన్సులు చేస్తూ చిరంజీవితో పోటా పోటీగా నటించి అభిమానులను మెప్పించింది..గ్యాంగ్ లీడర్ , యముడికి మొగుడు , అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి ఎన్నో హిట్ చిత్రాలలో జోడిగా నటించారు ...అయితే రాయకీయాలోకి వచ్చాక ఇద్దరు వేరు వేరు మార్గాలను ఎంచుకున్నారు ...చిరంజీవి రాజకీయాలకు స్వస్తి చెప్పి పూర్తిగా సినిమాల మీదనే ద్రుష్టి పెట్టాడు ..విజయ శాంతి కూడా సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ తో సినిమాల్లోకి రి ఎంట్రీ ఇచ్చారు .. సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వీరిద్దరూ పాల్గొని సందడి చేశారు. అయితే, ఇప్పుడు వీరిద్దరూ వెండితెరపై కలిసి కనిపించబోతున్నారని టాక్. సుధీర్ఘ విరామం తరవాత చిరంజీవి, విజయశాంతి కలిసి నటించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌లో చిరంజీవి నటిస్తోన్న విషయం తెలిసిందే. ‘సాహో’ ఫేమ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ‘లూసిఫర్’లో మంజు వారియర్‌ పాత్ర ఎంతో కీలకమైనది. ఈ పాత్రను తెలుగులో విజయశాంతి చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా, తెలుగు నేటివిటీకి తగినట్టు ‘లూసిఫర్’ స్క్రిప్ట్‌లో సుజీత్ మార్పులు చేర్పులు చేశారట. దీన్ని చిరంజీవికి వినిపించగా ఆయన ఓకే చేసేశారట. ఈ చిత్రాన్ని కూడా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

Tags :

Advertisement