Advertisement

  • రెమ్యూనరేషన్ తగ్గించ్చుకున్న తమిళ హీరో విజయ్

రెమ్యూనరేషన్ తగ్గించ్చుకున్న తమిళ హీరో విజయ్

By: chandrasekar Thu, 16 July 2020 6:36 PM

రెమ్యూనరేషన్ తగ్గించ్చుకున్న తమిళ హీరో విజయ్


తెలుగు సినిమా సినిమాకు పారితోషికాన్ని పెంచుతున్న మన కథానాయకులు పారితోషికాల విషయంలో పోటీలు పడుతూ పర్టిక్యులర్‌గా వుంటారు. హీరోలు, హీరోయిన్లు, దర్శకుల పారితోషికాలు చుక్కల్లోవుంటాయి.

ఓ స్టార్ హీరోతో బ్లాక్‌బస్టర్‌ సినిమా తీసిన నిర్మాతకు లాభాలు వుండటం లేదంటే దానికి కారణం హీరో, దర్శకుల పారితోషికాలే అయితే ఇటీవల కరోనా మహామ్మరి వల్ల దెబ్బతిన్న రంగాల్లో సినీ రంగం కూడా వుంది.

ఆఫ్టర్‌ కరోనా సినీ పరిశ్రమ కోలుకోవాలంటే హీరోలు తమ పారితోషికాన్ని స్వచ్చందంగా తగ్గించుకుంటే నిర్మాతలకు ఎంతో ఊరటగా వుంటుంది. ఇటీవల తమిళ హీరో విజయ్‌ తన పారితోషికంలో 20 కోట్ల పారితోషికాన్ని తగ్గించుకున్నాడు. రాబోయే రెండు సంవత్సరాల వరకు నటించబోయే సినిమాలకు ఇలాగే పారితోషికాన్ని అందుకోబోతున్నాడు.

విజయ్‌తో పాటు మరికొంత మంది తమిళ హీరోలు కూడా రెమ్యూనరేషన్‌కు తగ్గించుకోవడానికి సిద్దమయ్యారు. అయితే ఇప్పటి వరకు మన తెలుగు కథానాయకుల నుండి ఇలాంటి ప్రకటన వెలువడలేదు. తెలుగు హీరోలు కూడా ఇదే బాటలో నడిస్తే తెలుగు నిర్మాతలు కూడా కాస్త ఊరట ఉఅభిస్తుంది.

Tags :
|
|

Advertisement