Advertisement

  • ఆకట్టుకుంటున్న విజయ్ సేతుపతి 'తుగ్లక్ దర్బార్ ' ఫస్ట్ లుక్ ..

ఆకట్టుకుంటున్న విజయ్ సేతుపతి 'తుగ్లక్ దర్బార్ ' ఫస్ట్ లుక్ ..

By: Sankar Thu, 09 July 2020 11:47 AM

ఆకట్టుకుంటున్న విజయ్ సేతుపతి 'తుగ్లక్ దర్బార్ ' ఫస్ట్ లుక్ ..



సౌత్ ఇండియాలో ప్రస్తుతం అత్యంత బిజీ గా ఉన్న నటులలో ఒకరు విజయ్ సేతుపతి ..విలక్షణ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ..కేవలం తమిళ్ లోనే గాక పాత్ర నచ్చితే వేరే భాషల్లో కూడా నటిస్తున్నారు ..కేవలం హీరో గానే గాక , విలన్ , సహాయక పాత్ర ..ఇలా ఏ పాత్రలో అయినా మెప్పిస్తున్నారు ..కాగా ప్రస్తుతం ఆయన 'తుగ్లక్ దర్బార్'లో నటిస్తున్నారు.

తాజాగా ఈ 'తుగ్లక్ దర్భార్' చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. చూడటానికి ఎంతో డిఫరెంట్‌గా ఉన్న ఈ పోస్టర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో కేవలం విజయ్ సేతుపతి డిఫరెంట్ షేడ్స్ మాత్రమే చూపిస్తూ సినిమాపై ఆసక్తి రేకెత్తించారు. దీంతో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ ఎక్కడ చూసినా ఇదే పోస్టర్ కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా వైరల్ అవుతున్న ఈ 'తుగ్లక్ దర్భార్' ఫస్ట్‌లుక్‌ పోస్టర్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతుండటం విశే

ఢిల్లీ ప్రసాద్ దీన్ దయాలన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'తుగ్లక్ దర్భార్' చిత్రానికి లలిత్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గోవింద్ వసంత్ సంగీతం అందిస్తున్నారు. రాధా కృష్ణన్ పార్థిబన్, అదితి రావ్ హైదరీ, మంజిమా మోహన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అతిత్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ సేతుపతి హీరో గా నటించిన 96 సినిమాకు సంగీత దర్శకత్వం చేసిన గోవింద్ వసంత్ ..ఈ సినిమాకు కూడా స సంగీతం అందిస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు ఇంకా పెరిగాయి ..

Tags :

Advertisement