Advertisement

  • పుష్ప సినిమా నుంచి అందుకే తప్పుకున్న ..క్లారిటీ ఇచ్చిన విజయ్ సేతుపతి ..

పుష్ప సినిమా నుంచి అందుకే తప్పుకున్న ..క్లారిటీ ఇచ్చిన విజయ్ సేతుపతి ..

By: Sankar Mon, 13 July 2020 9:55 PM

పుష్ప సినిమా నుంచి అందుకే తప్పుకున్న ..క్లారిటీ ఇచ్చిన విజయ్ సేతుపతి ..



స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రంలో తమిళ హీరో విజయ్‌ సేతుపతి ఓ కీలక పాత్ర పోషించాల్సి ఉండింది. అయితే సినిమా షూటింగ్‌ ప్రారంభానికి ముందే ఆయన ఆ చిత్రం నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వెలువడ్డాయి. కొత్తగా కన్నడ నటుడు ధనుంజయ ఈ మూవీలోకి తీసుకోవడంతో ఆ వార్తలు నిజమేనని అంతా భావించారు. అయితే విజయ్‌ ఈ చిత్రం నుంచి తప్పుకోవడానికి సంబంధించి సోషల్‌ మీడియాలో అనేక రకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా అందుకు సంబంధించి విజయ్‌ స్పష్టతనిచ్చారు.

ఓ ప్రముఖ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. తను పుష్ప చిత్రం నుంచి తప్పుకున్నది వాస్తమేనని తెలిపారు. డేట్స్‌ కుదరకపోవడం వల్లే తను ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగినట్టు వెల్లడించారు. ఈ విషయాన్ని డైరెక్టర్‌ సుకుమార్‌కు కలిసి వివరించానని అన్నారు. సినిమా చేయాలని ఉన్నప్పటికీ.. తన డేట్స్‌ వల్ల షూటింగ్‌కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు.

ఇప్పటికే విడుదలైన పుష్ప ఫస్ట్‌ లుక్‌ విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటుగా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. మరోవైపు గతంలోనే ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. కరోనా లాక్‌డౌన్‌తో వాయిదా పడింది. ఆ తర్వాత ఇప్పటివరకు షూటింగ్‌ ప్రారంభం గురించి చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

అయితే విజయ్ సేతుపతి కొత్త సినిమా తుగ్లక్ దర్బార్ ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల అయి వైరల్ అయింది ..ఎప్పుడు కొత్త కథలతో అలరించే విజయ్ సేతుపతి ఈ కొత్త సినిమా ఫస్ట్ లుక్ చూస్తే మరొక డిఫరెంట్ కథతో వస్తున్నట్లే అనిపిస్తుంది...

Tags :
|
|
|
|

Advertisement