Advertisement

  • ఆ యువ స్టార్ హీరోతో సుకుమార్ సినిమా ..అభిమానుల్లో ఇప్పటినుంచే భారీ అంచనాలు

ఆ యువ స్టార్ హీరోతో సుకుమార్ సినిమా ..అభిమానుల్లో ఇప్పటినుంచే భారీ అంచనాలు

By: Sankar Tue, 29 Sept 2020 07:07 AM

ఆ యువ స్టార్ హీరోతో సుకుమార్ సినిమా ..అభిమానుల్లో ఇప్పటినుంచే భారీ అంచనాలు


టాలీవుడ్ లో మరొక క్రేజీ కాంబినేషన్ కు అంగం సిద్ధం అయింది..సినిమా సినిమా కు కొత్తదనం చేయించే స్టార్ డైరెక్టర్ సుకుమార్ , యంగ్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది..కేదార్‌ సెలగంశెట్టి అనే యువ నిర్మాత ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు.

ఫాల్కన్‌ క్రియేషన్‌స ఎల్‌ఎల్‌పి పతాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా కేదార్‌ సెలగంశెట్టి ఈ ప్రాజెక్టును ప్రకటించి, మాట్లాడుతూ– ‘‘నాకెంతో ఇష్టమైన విజయ్‌ దేవరకొండ, సుకుమార్‌గార్లతో నా మొదటి సినిమా చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది. వీరి కాంబినేషన్‌ అనగానే చాలా అంచనాలుంటాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వాళ్ల శైలిలోనే ఈ సినిమా ఉంటుంది.

ప్యాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందించనున్నాం. 2022లో సినిమా మొదలవుతుంది. సినిమాల మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చాను. భవిష్యత్‌లో వరుసగా సినిమాలు చేస్తాను’’ అన్నారు.ఇక ప్రస్తుతం సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తుండగా , విజయ్ దేవరకొండ పూరి దర్శకత్వంలో ఫైటర్ సినిమాలో నటిస్తున్నాడు..

Tags :

Advertisement