Advertisement

మెగాస్టార్ సినిమాలో 'రౌడీ' హీరో ...

By: Sankar Thu, 09 July 2020 2:50 PM

మెగాస్టార్ సినిమాలో 'రౌడీ' హీరో ...

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తూ యువ హీరోలకు సవాల్ విసురుతున్నారు ..ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ ,మలయాళం లో సూపర్ హిట్ అయినా లూసిఫెర్ సినిమా రీమేక్ లో నటించనున్నారు ..ఆ సినిమాలో మోహన్ లాల్ పోషించిన పవర్ ఫుల్ పాత్రను తెలుగులో చిరంజీవి పోషిస్తున్నారు ..అయితే ఈ సినిమా గురించి అనేక వార్తలు వస్తున్నాయి ..

తాజాగా అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కూడా భాగం కాబోతున్నారని తెలుస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. 'లూసిఫర్' ఒరిజినల్ వర్షన్‌లో మోహన్ లాల్ హీరోగా నటించగా ఆయనకు నమ్మిన బంటుగా జాయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఈ క్రమంలో 'లూసిఫర్' తెలుగు రీమేక్‌లో చిరంజీవిని హీరోగా చూపిస్తూ ఆయనకు నమ్మిన బంటు పాత్రను విజయ్ దేవరకొండతో చేయించాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. ఇందుకు సంబంధించిన డీల్ కూడా సీక్రెట్‌గానే సెట్ చేసుకున్నారని టాక్.

ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ ..మెగాస్టార్ సినిమాలో నటిస్తే తన క్రేజ్ మరింత పెరుగుతుంది అనడం లో ఏ మాత్రం సందేహం లేదు ..అయితే ఇదే పాత్రకు మొదటగా రామ్ చరణ్ అనగా , ఆ తర్వాత అల్లు అర్జున్ , ఇప్పుడు విజయ్ మరి చివరకు ఎవరు చేస్తారో చూడాలి ..

Tags :
|

Advertisement