Advertisement

  • 8 మిలియన్ ఫాలోవర్స్‌తో రికార్డ్ సాధించిన విజయ్ దేవరకొండ

8 మిలియన్ ఫాలోవర్స్‌తో రికార్డ్ సాధించిన విజయ్ దేవరకొండ

By: chandrasekar Fri, 17 July 2020 11:08 AM

8 మిలియన్ ఫాలోవర్స్‌తో రికార్డ్ సాధించిన విజయ్ దేవరకొండ


ప్రస్తుతం తెలుగులో యమ క్రేజ్ ఉన్న యువ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరుగా రాణిస్తున్నాడు. తన మాటలతో పాటు, చేతలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకుని యూత్‌లో మాంచి ఫాలోయింగ్ సంపాదించాడు. చెప్పాలంటే అతి తక్కువ కాలంలో విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్ గా ఎదిగాడు. ఇక ఆయన మరో ఫీట్ సాధించాడు.

తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో 8 మిలియన్ ఫాలోవర్స్‌తో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. ఏ సౌత్ ఇండియా స్టార్‌కు లేనంత ఫాలోయింగ్ విజయ్ సొంతం. అంతటి ఫీట్‌ను విజయ్ చాలా సింపుల్‌గా సాధించి వావ్ అనిపించాడు.

దీనికి సంబందించిన ఓ పోస్టర్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. దాదాపు సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్‌లు కలసి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ యువ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది.

Tags :
|
|

Advertisement