Advertisement

  • టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన విజయ్ దేవరకొండ

టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన విజయ్ దేవరకొండ

By: chandrasekar Mon, 28 Sept 2020 4:07 PM

టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన విజయ్ దేవరకొండ


టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను విజయ్ దేవరకొండ ప్రకటించారు. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు. తెలుగులో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సుకుమార్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసాడు. ఈ చిత్రాన్ని ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్‌లో కేదార్ సలగంశెట్టి నిర్మిస్తున్నారు. ప్రొడ్యూసర్‌గా ఈయనకు ఇదే తొలి చిత్రం. ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్లకు అనుమతి ఇవ్వడంతో త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో కథానాయికగా అనన్యకు ఇదే తొలి సినిమా. ఈ సినిమాతో అనన్య దక్షిణాదిలో కూడా సత్తా చాటాలని చూస్తోంది. మరోవైపు సుకుమార్ కూడా అల్లు అర్జున్‌తో ప్యాన్ ఇండియా లెవల్లో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం కూడా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

అల్లు అర్జున్‌తో నడుస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ శేషాచలం అడవుల్లోని ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ కూడా రఫ్‌గా ఉంది. ఈ చిత్రాన్ని సుకుమార్ రివేంజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో తమిళ హీరో విజయ్ సేతుపతిని అనుకున్నారు. కానీ ఆయన డేట్స్ అడ్డస్ట్ చేయలేకపోవడంతో ఈ పాత్రను వేరే ఏ హీరోతో చేయిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.

మరోవైపు ఈ సినిమాలో ఇంకో హీరోయిన్‌కు ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇక విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా లెవల్లోనే తెరకెక్కిస్తున్నారు. ‘ఫైటర్’, ‘పుష్ప’ తర్వాత వీళ్లిద్దరికి ఇది రెండో ప్యాన్ ఇండియా సినిమా అనే చెప్పాలి. వీళ్ల కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ఈ చిత్రం కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో నిర్మిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ హీరోయిన్‌నే అనుకుంటున్నారు.

Tags :

Advertisement