Advertisement

  • విజయ్ ఆంటోనీ బ్లాక్ బస్టర్ మూవీ బిచ్చగాడు సీక్వెల్ ఫస్ట్ లుక్ విడుదల ..

విజయ్ ఆంటోనీ బ్లాక్ బస్టర్ మూవీ బిచ్చగాడు సీక్వెల్ ఫస్ట్ లుక్ విడుదల ..

By: Sankar Fri, 24 July 2020 3:50 PM

విజయ్ ఆంటోనీ బ్లాక్ బస్టర్ మూవీ బిచ్చగాడు సీక్వెల్ ఫస్ట్ లుక్ విడుదల ..



బిచ్చగాడు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజ‌యాన్ని సాధించి తెలుగు రాష్ట్రాల్లో త‌న‌కంటూ ఓ ప్రత్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్నారు విజ‌య్ ఆంటొని. 2016లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గర సంచ‌ల‌నం సృష్టించింది. తమిళ అనువాద చిత్రం అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు ..ఇటీవల కాలంలో బిచ్చగాడూ రేంజ్ లో ఏ అనువాద చిత్రం కూడా విజయం సాధించలేదు ...

అయితే, ఇప్పుడు జాతీయ అవార్డు గ్రహీత ప్రియ కృష్ణస్వామి ద‌ర్శక‌త్వంలో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ఓ వైపు మ్యూజిక్ డైరెక్టర్‌గా, మ‌రోవైపు హీరోగా రాణిస్తోన్న విజయ్ ఆంటొని ఈరోజు (జూలై 24న) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ‘బిచ్చగాడు 2’ ఫ‌స్ట్ లుక్‌, టైటిల్ ‌లోగోను విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. విజ‌య్ ఆంటొని అటువైపు నిల్చొని ఉన్న ఈ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివ‌రాలు త్వర‌లో తెలియ‌జేయ‌నున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎన్నో సూప‌ర్‌ హిట్ చిత్రాల‌కు సంగీతం అందించిన విజ‌య్ ఆంటొని.. మంచి కంటెంట్ ఉన్న చిత్రాల‌ను ప్రేక్షకులకు అందించాల‌ని భావించి, హీరో మరియు నిర్మాత‌గా మారి అటు తమిళం, ఇటు తెలుగులో హీరోగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు.

Tags :
|

Advertisement