Advertisement

  • భారీగా బరువు తగ్గిన స్టార్ తెలుగు కమెడియన్

భారీగా బరువు తగ్గిన స్టార్ తెలుగు కమెడియన్

By: Sankar Tue, 23 June 2020 8:22 PM

భారీగా బరువు తగ్గిన స్టార్ తెలుగు కమెడియన్



తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో లేడి స్టార్‌ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు విద్యుల్లేఖ రామన్‌. బొద్దుగా తనదైన నటనతో అందరి మెప్పించే విద్యుల్లేఖ.. లాక్‌డౌన్‌ సమయంలో తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు. అందుకోసం తీవ్రంగా శ్రమించిన విద్యుల్లేఖ.. అసాధారణంగా రీతిలో బరువు తగ్గారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. నకిలీ విశ్వాసం వర్సెస్‌ నిజమైన విశ్వాసం అని పేర్కొన్నారు. జూన్‌ 20 నాటికి 68.2 కిలోల బరువు ఉన్నానని విద్యుల్లేఖ వెల్లడించారు. ఇందుకోసం ఎలాంటి కషాయాలు, ఎటువంటి మాత్రలు వినియోగించలేదని స్పష్టం చేశారు. వారానికి ఆరు సార్లు వ్యాయామం చేశానని, డైట్‌ పాటించానని వెల్లడించారు

నేను అధిక బరువుతో ఉన్నప్పుడు చాలా మంది మీరు ఎంత నమ్మకంగా ఉన్నారు అని అడిగేవారు. అప్పుడు నా ఆత్మ విశ్వాసంపై నాకే అనుమానం కలిగేది. కానీ ఇప్పుడు మాత్రం నా మీద నేను పూర్తి నమ్మకంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఊహించని విధంగా నా జీవనశైలి, అలవాట్లను మార్చుకోగలిగాను. మీరు చేయాలని అనుకున్న దానిపై మనసు పెడితే ఏదైనా సాధించవచ్చని గ్రహించాను’ అని విద్యుల్లేఖ పేర్కొన్నారు.


Tags :
|
|
|
|

Advertisement