వైరల్ అవుతోన్నహీరోయిన్ "శ్రద్ధా శ్రీనాథ్" వీడియో
By: chandrasekar Sat, 27 June 2020 2:54 PM
తెలుగు తెరకు 'జెర్సీ' సినిమా
ద్వారా పరిచయం అయిన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. ఆ సినిమాలో శ్రద్ధా తన నటనతో
అదరగొట్టింది. శ్రద్ధా తెలుగులోనే కాకుంండా అటు కన్నడ, తమిళ
సినిమాలు చేస్తోంది.
అందంతో పాటు అభినయంలో
కూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ. ఆమె తాజాగా
తెలుగులో నటించిన 'కృష్ణ అండ్ హిజ్ లీల' మూవీ ఓటీటీలో రిలీజ్‌కి
అక్కడ అదరగొడుతోంది.
రవికాంత్ దర్శకత్వం
వహించిన ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేశాడు. సీరత్ కపూర్, శాలినీ
ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్లో భాగంగా జూన్ 2017లో
నందిహిల్స్‌లో షూట్ జరుగున్న సందర్భంలో ఈ సినిమా దర్శకుడు శ్రద్ధా దగ్గరికి వచ్చి
‘బైక్ నడపడం వచ్చా?’ అని అడిగాడట. అయితే ఆమె నో అని చెప్పి ప్రయత్నిస్తా
అని ధైర్యంగా బైక్ ఎక్కి నడిపే ప్రయత్నం చేసిందట. అయితే రోడ్డు తడిగా ఉండడంతో
బుల్లెట్ బ్యాలెన్స్ చేయలేక స్కిడ్ అయ్యి కిందపడ్డానని పేర్కోంది.
అయితే తాను కింద పడడంతో
సెట్లో ఉన్న వారంతా నాకేమైందోనని కంగారుపడ్డారు. కానీ నాకేమీ కాలేదు కానీ
బుల్లెట్ డ్యామేజ్ అయింది అంతే. అయినా రాయల్ ఎన్ఫీల్డ్ ఎందుకు అంత బరువుగా
ఉంటుందో? అంటూ
చెప్పకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. దీనికి సంబందించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో
షేర్ చేసింది. ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.