Advertisement

  • పవన్ స్టార్‌ లో ముఖ్యపాత్రను పోషించనున్న వర్మ

పవన్ స్టార్‌ లో ముఖ్యపాత్రను పోషించనున్న వర్మ

By: chandrasekar Tue, 14 July 2020 12:16 PM

పవన్ స్టార్‌ లో ముఖ్యపాత్రను పోషించనున్న వర్మ


ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్‌ లోగోలో టీ గ్లాసు ఉండడం ఆసక్తి రేపుతోంది. అంతేకాదు ఎన్నికల తర్వాత కథ అంటూ పోస్టర్ రిలీజ్ చేసాడు.

వర్మ మాత్రం ఈ చిత్రాన్ని ఎవరిని ఉద్దేశించి తీస్తున్న సినిమా కాదని చెబుతోన్న ఈ సినిమాను వర్మ పవన్ కళ్యాణ్‌‌ను ఉద్దేశించి ఈ సినిమా తీస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఒక్కో పోస్టర్ విడుదల చేస్తూ సంచలనం రేపుతున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్‌ను కొట్టినట్టు విడుదల చేసిన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అంతేకాదు చిరంజీవి, నాగబాబుతో పాటు పలువురు నటీనటులకు సంబంధించిన పోస్టర్స్ కూడా రిలీజ్ చేసి ఈ సినిమాపై ఆసక్తికలిగేలా చేసాడు. ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించడమే కాదు అందులో ముఖ్యపాత్రను పోషించబోతున్నట్టు సమాచారం.

పవర్ స్టార్ చిత్రంలో వర్మ కమెడియన్ నుంచి నిర్మాతగా మారిన బండ్ల గణేష్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో వర్మ అన్నా నువ్వు దేవుడవ్నా వచ్చే ఎన్నికల్లో విజయం మనదే. నీకు తిరుగులేదు అనే టైపులో రామ్ గోపాల్ వర్మ క్యారెక్టర్ ఉండబోతుందనేది సమాచారం. మాములుగానే వర్మ అంటేనే ఓ కొంటెతనం ఉంటుంది. అలాంటి కొంటె దర్శకుడు బండ్ల గణేష్ వంటి కమెడియన్ కమ్ నిర్మాత పాత్ర పోషిస్తే తెరపై ఎలా ఉంటుందో చూడాలి.

Tags :
|
|
|
|

Advertisement