Advertisement

  • ఆ విప్లవ గాయనికి , సాయి పల్లవి పాత్రకు సంబంధం లేదు ..విరాట పర్వం దర్శకుడు వేణు ఊడుగుల

ఆ విప్లవ గాయనికి , సాయి పల్లవి పాత్రకు సంబంధం లేదు ..విరాట పర్వం దర్శకుడు వేణు ఊడుగుల

By: Sankar Mon, 13 July 2020 10:19 AM

ఆ విప్లవ గాయనికి , సాయి పల్లవి పాత్రకు సంబంధం లేదు ..విరాట పర్వం దర్శకుడు వేణు ఊడుగుల



నీది నాది ఒకే కథ సినిమాతో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వేణు ఊడుగుల తర్వాత సినిమా విరాట పర్వం ..ఇందులో రానా హీరోగా నటిస్తుండగా సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుంది ..ఈ చిత్రాన్ని డి. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమా నుంచి సాయి పల్లవి ఫస్ట్ లుక్ విడుదలైన దగ్గర నుంచీ ఆమె చేస్తోన్న పాత్ర గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. 1990ల్లో జరిగిన నక్సలైన్ ఉద్యమం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని, తెలంగాణ ప్రాంతానికి చెందిన నక్సలైట్, విప్లవ గాయని బెల్లి లలిత పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారని ఇప్పటికే రూమర్లు చక్కర్లు కొట్టాయి.

అయితే, ఈ రూమర్లపై దర్శకుడు వేణు ఊడుగుల స్పందించారు. ఈ రూమర్లలో నిజం లేదని ఆయన అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఎన్నో నక్సలైట్ ఉద్యమాలకు కేంద్ర బిందువు అయిన వరంగల్ జిల్లా నుంచి నేను వచ్చాను. నేను పుట్టి పెరిగిన వరంగల్‌లో సమాజంలో మార్పు కోసం ఎలాంటి భయం లేకుండా ఉద్యమాలను లేవదీసినవాళ్లను నేను చూశాను. అవన్నీ ఇప్పుడు ‘విరాటపర్వం’లో చూపిస్తున్నాను. బెల్లి లలిత పాత్రను సాయి పల్లవి పోషించడం లేదు. కానీ, ఆమె పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాకు ఎంతో కీలకం ఆ పాత్ర. అలాంటి రోల్‌ను సాయి పల్లవి అద్భుతంగా చేశారు. ఆమె నటన కచ్చితంగా అందరినీ మెప్పిస్తుంది’’ అని వేణు చెప్పుకొచ్చారు.

అయితే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గరి నుంచే సినిమా మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి ..టైటిల్ దగ్గరి నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లు అన్ని విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాయి ..ఇందులో స్టార్ హీరోయిన్ ప్రియమణి కూడా మరొక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు ..ఇక సినిమాకు సంబంధించి ఇంకా 10 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని వేణు చెప్పారు. అయితే, ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం 300 మంది జూనియర్ ఆర్టిస్టులు అవసరమని, ప్రస్తుతం పరిస్థితుల్లో అది సాధ్యపడదు కాబట్టి షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపామన్నారు. పరిస్థితులు చక్కబడిన తరవాత షూటింగ్ మొదలుపెడతామని చెప్పారు..

Tags :

Advertisement