Advertisement

  • ప్రముఖ సిమెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

ప్రముఖ సిమెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

By: Sankar Tue, 02 June 2020 8:39 PM


ప్రముఖ సిమెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ వ‌రుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన ‘గ‌ద్దల‌కొండ గ‌ణేష్’ సినిమా కిందటేడాది బాక్సాఫీస్ ద‌గ్గర మంచి వ‌సూళ్లను రాబట్టింది. ఇక వ‌రుణ్ తేజ్ బ్రాండ్స్, అండోర్స్‌మెంట్స్ ఫీల్డ్‌లో కూడా దూసుకుపోతున్నారు. ఇప్పటికే ప‌లు దేశీయ బ్రాండ్లకి అండోర్స్ చేస్తున్న వ‌రుణ్ తేజ్ తాజాగా ప్రముఖ సిమెంట్ బ్రాండ్ నాగార్జున సిమెంట్స్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండేందుకు అంగీక‌రించారు

varun tej,naragjuna,cement,tollywood,gaddalakonda ganesh , వ‌రుణ్ తేజ్,  ప్రముఖ సిమెంట్ బ్రాండ్,  నాగార్జున సిమెంట్స్‌,  బ్రాండ్ అంబాసిడ‌ర్‌, మెగా ప్రిన్స్

తమ బ్రాండ్‌కు వరుణ్ తేజ్ ప్రచారకర్తగా వ్యవహరిస్తోన్న పోస్టర్లను నాగార్జున సిమెంట్స్ యాజమాన్యం అధికారికంగా విడుద‌ల చేసింది. నాగార్జున సిమెంట్స్‌కి సంబంధించిన పాపుల‌ర్ ట్యాగ్ లైన్స్ (మీ అనుంబంధ‌మే మా బ‌లం, ప్రతి సౌధంలో మొన‌గాడై నిలిచి)తో ఈ పోస్టర్స్‌ని తయారుచేశారు. ఈ అడ్వర్టైజింగ్ పోస్టర్లలో వరుణ్ లుక్ కూడా అదిరిపోయింది. ఆయన హెయిర్ కట్, గుబురు గెడ్డం చాలా స్టైలిష్‌గా ఉంది..

లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటోన్న వరుణ్ తేజ్ ప్రస్తుతం త‌న కొత్త సినిమా కోసం బాక్సింగ్‌లో స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ‘బాక్సింగ్’ అనే టైటిల్‌ను ఈ సినిమాకు పరిశీలిస్తున్నారు. వరుణ్ తేజ్‌కు ఇది 10వ సినిమా. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం షూటింగ్ ఆగింది.


Tags :
|

Advertisement