Advertisement

  • మా కుటుంబంలోకి స్వాగతం బావ ..నిహారిక ఎంగేజ్మెంట్ పై స్పందించిన వరుణ్ తేజ్

మా కుటుంబంలోకి స్వాగతం బావ ..నిహారిక ఎంగేజ్మెంట్ పై స్పందించిన వరుణ్ తేజ్

By: Sankar Fri, 14 Aug 2020 12:06 PM

మా కుటుంబంలోకి స్వాగతం బావ ..నిహారిక ఎంగేజ్మెంట్ పై స్పందించిన వరుణ్ తేజ్


మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిజ ఎంగేజ్మెంట్ నిన్న రాత్రి అతి కొద్దీ మంది బంధువుల సమక్షంలో జరిగింది..మెగాస్టార్ చిరంజీవి , సురేఖ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ఉపాసనహాజరు అయి వాడెవరులను ఆశీర్వాదించారు ..అల్లు అర్జున్ కూడా హాజరు అయ్యారు కానీ అయితే ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం ఈ వేడుకలో కనిపించకపోవడం గమనార్హం.

నా బేబి సిస్టర్ నిశ్చితార్థం చేసుకుంది. వెల్‌కమ్ టు మై ఫ్యామిలీ బావా'' అంటూ తన బావకు హృదయపూర్వక స్వాగతం పలికారు వరుణ్ తేజ్. ఇక నాగబాబు రియాక్ట్ అవుతూ.. ''చాలామంది అంటుంటారు నిహారిక చాలా విషయాల్లో నాలాగే ఉంటుందని. తనపై నువ్వు అపారమైన ప్రేమను కురిపిస్తూ లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటావని బలంగా నమ్ముతున్నాను. ఇకపై అది అధికారికంగా నీ సమస్య'' అంటూ అల్లుడిపై తనదైన స్టైల్ కామెంట్ చేశారు నాగబాబు.

కాగా మెగా ఫామిలీ లో వేడుక కావడంతో మెగా ఫాన్స్ అంతా ఖుషీగా ఉన్నారు... మెగా కుటుంబాన్ని ఒకే ఫ్రేమ్‌లో చూసి తెగ మురిసిపోతున్నారు ఫ్యాన్స్. నిహారికకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపూతూ నిహారిక- చైతన్య ఫొటోలతో సోషల్ మీడియాకు సరికొత్త కళ తీసుకొస్తున్నారు

Tags :

Advertisement