Advertisement

  • వ‌ర్మ నెక్స్ట్ సినిమాకి ‘అర్నాబ్ - ది న్యూస్ ప్రాస్టిట్యూట్’ అని టైటిల్ క‌న్‌ఫాం

వ‌ర్మ నెక్స్ట్ సినిమాకి ‘అర్నాబ్ - ది న్యూస్ ప్రాస్టిట్యూట్’ అని టైటిల్ క‌న్‌ఫాం

By: chandrasekar Tue, 04 Aug 2020 12:54 PM

వ‌ర్మ నెక్స్ట్ సినిమాకి ‘అర్నాబ్ - ది న్యూస్ ప్రాస్టిట్యూట్’ అని టైటిల్ క‌న్‌ఫాం


క‌రోనా సంక్షోభంలో కూడా రామ్ గోపాల్ వ‌ర్మ మాత్రం వ‌రుస సినిమాలు చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ఈ లాక్‌డౌన్ టైంలో వ‌ర్మ చేసిన సినిమాలు ప్రేక్ష‌కుల‌కి ఎంతో కొంత వినోదాన్ని ఇచ్చాయనే చెప్పాలి. ఇక ప్ర‌స్తుతం మ‌ర్డ‌ర్‌, థ్రిల్ల‌ర్ చిత్రాల‌తో బిజీగా ఉన్న ఆర్జీవి త్వ‌ర‌లో ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిపై సినిమా చేయ‌నున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ ఈ సినిమాకు ‘అర్నాబ్ - ది న్యూస్ ప్రాస్టిట్యూట్’ అని టైటిల్ క‌న్‌ఫాం చేసిన‌ట్టు పేర్కొన్నాడు. అర్నాబ్ గోస్వామి ఇటీవ‌ల సుశాంత్ మ‌ర‌ణం విష‌యంలో ప‌లు డిబేట్స్ ఏర్పాటు చేస్తున్నాడు. బాలీవుడ్‌ని ఏకి పారేస్తూ చెడామ‌డా తిట్టేస్తున్నాడు.

బాలీవుడ్‌ని డ‌ర్టీ అని సంబోదిస్తూ.. అండ‌ర్ వ‌ర‌ల్డ్‌తో బాలీవుడ్‌కి సంబంధాలు ఉన్నాయ‌ని, దివ్య భారతి మృతి మొదలుకొని జియా ఖాన్, శ్రీదేవి, ఇప్పుడు సుశాంత్ మ‌ర‌ణం వ‌ర‌కు అంతా మిస్ట‌రీగానే ఉంది. దీనికి బాలీవుడ్ స‌మాధానం చెప్పాల్సి ఉదంటూ అర్నాబ్ ప‌లు వ్యాఖ్య‌లు చేయ‌గా, ఈ విషయంపై వ‌ర్మ వ‌రుసగా ట్వీట్లు వేస్తూ త‌న‌దైన శైలిలో బ‌దులిచ్చారు. బాలీవుడ్ ఇండ‌స్ట్రీ గురించి అర్నాబ్ గోస్వామి త‌ప్పుగా మాట్లాడ‌డం న‌న్ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇది డ‌ర్టీ ఇండ‌స్ట్రీ అని, దీనికి క్రిమిన‌ల్ క‌నెక్ష‌న్స్ ఉన్నాయ‌ని, రేపిస్టులు, గ్యాంగస్టర్స్, కామ పిశాచాలతో ఈ ఇండస్ట్రీ నిండిపోయిందని అర్నాబ్ అన్నట్టు వర్మ వెల్లడించారు. ‘‘దివ్య భారతి, జియా ఖాన్, శ్రీదేవి, సుశాంత్ మరణాలు ఒకే రకమైనవని అర్నాబ్ గోస్వామి గుడ్డిగా వాదించ‌డం న‌న్ను షాక్‌కి గురి చేసింది.

ఇంద‌రి మృతికి బాలీవుడ్ కార‌ణం అంటూ అర్నాబ్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌ని చూస్తుంటే 'బాలీవుడ్ ఏమైన విలే పార్లే శ్మ‌శానంలో నిద్ర‌పోతున్న దెయ్యమా' అని అనుమానం వ‌స్తుంది. రక్త‌దాహం ఉన్నప్పుడ‌ల్లా డ్రాకులాలా మారిపోయి బ‌య‌టికి వ‌చ్చి చంపేస్తుందా? అంటూ వ‌ర్మ ప్ర‌శ్న‌లు వేశారు‌. అయితే అర్నాబ్ ఇంత దారుణంగా మాట్లాడుతుంటే ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్, మహేష్ భట్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ సహా ఇతర బాలీవుడ్ స్టార్లు ఎందుకు స్పందించ‌డం లేదో అర్ధం కావ‌డం లేదు. మౌనంగానే ఉంటే ఖ‌చ్చితంగా త‌ప్పు చేసిన వారే అవుతారు.

వీరంతా మౌనంగా ఉంటే కచ్చితంగా తప్పుచేసినట్టే అవుతుందని హెచ్చరించారు. అర్నాబ్ త‌ప్పుడు కామెంట్స్‌పై స్పందించాల‌ని, జింక‌లా భ‌య‌ప‌డ‌కుండా అడ‌వి శున‌కంలా విరుచుకుప‌డాల‌ని వ‌ర్మ పేర్కొన్నారు. ఓ వైపు అర్నాబ్ గోస్వామిపై విరుచుకుపడుతూ వరుస ట్వీట్లు చేస్తూనే ఆయనపై సినిమాను ప్రకటించేశారు వర్మ. ‘అర్నాబ్ - ది న్యూస్ ప్రాస్టిట్యూట్’ అనే టైటిల్‌తో సినిమా చేస్తాన‌ని అన్న వ‌ర్మ‌.. ఒకవేళ అర్నాబ్ గోస్వామి తన సినిమాపై స్పందించినా, తనను కించపరచడానికి ప్రయత్నించినా దాన్ని తన సినిమా ప్రచారం కోసం వాడుకుంటానని వర్మ స్పష్టం చేశారు.

Tags :
|
|

Advertisement