Advertisement

  • ప్రపంచంలో మొట్టమొదటి పెయిడ్ ట్రైలర్ స్టార్ట్ చేసిన వ‌ర్మ

ప్రపంచంలో మొట్టమొదటి పెయిడ్ ట్రైలర్ స్టార్ట్ చేసిన వ‌ర్మ

By: chandrasekar Mon, 20 July 2020 6:25 PM

ప్రపంచంలో మొట్టమొదటి పెయిడ్ ట్రైలర్ స్టార్ట్ చేసిన వ‌ర్మ


సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించిన వారంద‌రు క‌రోనా టైంలో షూటింగ్లు ఆగిపోయి, సినిమా హాల్స్ మూసివేయడంతో గ‌గ్గోలు పెడుతుంటే వర్మ మాత్రం ఈ సంక్షోభాన్ని కూడా క్యాష్ చేసుకుంటున్నాడు. ఇప్ప‌టికే www.rgvworldtheatre.com లో రెండు సినిమాల‌ని విడుద‌ల చేసిన వ‌ర్మ 'పవర్ స్టార్' సినిమా జూలై 25న ఉదయం 11గంట‌లకి విడుద‌ల కానుంద‌ని తెలియ‌జేశాడు.

అయితే జూలై 22న ఉదయం 11 గంటల‌ నుండి "పవర్ స్టార్" ట్రైలర్ ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో అందుబాటులో ఉంటుందని, ఈ ట్రైలర్ చూడాలంటే పే ఫర్ వ్యూ పద్ధతిలో 25 రూపాయలు చెల్లించాలని పేర్కొన్నాడు.

ఇది ప్రపంచంలో మొట్టమొదటి పెయిడ్ ట్రైలర్ అని చెప్పకొచ్చాడు. ఇక 'పవర్ స్టార్' సినిమా కోసం www.rgvworldtheatre.com లో 'ట్రైలర్ బుకింగ్', 'అడ్వాన్స్ బుకింగ్', 'బ్లాక్ బుకింగ్', 'కరెంట్ బుకింగ్' అని 4 రకాల పే పర్ వ్యూ బుకింగ్స్ తీసుకొచ్చాడు. జూలై 25 ఉదయం 11 లోపు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే టికెట్ ధర రూ. 150 అని అదే 11 గంటల తర్వాత బ్లాక్ లో టికెట్స్ కొన్నట్లు ధర రూ. 250 చెల్లించాల్సి ఉంటుందని ముందే బుక్ చేసుకుంటే రూ. 100 సేవ్ అవుతాయి. త్వరపడండి అంటూ సలహా కూడా ఇస్తున్నాడు. మొత్తానికి ట్రెండ్ సెట్ట‌ర్‌గా మారిన వ‌ర్మ క‌రోనా టైంలో తీసుకొస్తున్న కొత్త మార్పులు ఎలాంటి ఫలితాలని ఇస్తాయో చూడాలి.

Tags :
|
|
|

Advertisement