Advertisement

  • మిడతల దండు సినిమా తీయండి ..వర్మకు నెటిజెన్ల సూచనలు

మిడతల దండు సినిమా తీయండి ..వర్మకు నెటిజెన్ల సూచనలు

By: Sankar Sat, 30 May 2020 12:04 PM

మిడతల దండు సినిమా తీయండి ..వర్మకు నెటిజెన్ల సూచనలు

రామ్ గోపాల్ వర్మ ఏది మాట్లాడిన సంచలనమే ..ప్రపంచం మొత్తం కరోనాతో అల్లాడిపోతుంటే , ఇలాంటి టైం లో కూడా వరుసగా సినిమాలు చేయడం వర్మకు మాత్రమే సాధ్యం అయింది..ఇటీవల కాలంలో సినిమాల కంటే ట్విట్టర్లో ట్వీట్ల వలన ఎక్కువగా వార్తల్లో ఉండే వర్మ , మరొకసారి ట్విట్టర్ వేదికగా కొన్ని వ్యాఖ్యలు చేసాడు..ఇప్పటికే వివిధ సమస్యలతో ప్రపంచం కొట్టుమిట్టాడుతుంటే మిడతల రూపంలో కొత్త సమస్య వచ్చిచేరింది. మిడతల దండు పంటపొలాలను నాశనం చేస్తుండటం ప్రభుత్వాలకు తలపోటుగా మారింది. ఈ క్రమంలో మిడతల దండుపై తన దైన శైలిలో స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశాడు వర్మ.


ramgopal varma,rgv,tweets,locust .tollywood ,వర్మ. మిడతల దండు, రామ్ గోపాల్ వర్మ ,  ట్విట్టర్,కరోనా

వైరస్‌లు ప్రపంచంపై దాడి చేసిన అనంతరం ప్రస్తుతం మిడతలు అటాక్‌ చేస్తున్నాయని, తదుపరి ఏలియన్స్‌ దాడులు చేస్తాయా? అని ప్రశ్నిస్తూ వర్మ ట్వీట్‌ చేస్తూ ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశారు. ‘ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంటే మిడతలు మాత్రం ప్రపంచ పర్యటనలో ఉన్నాయి’ అంటూ మరో సెటైరికల్‌ ట్వీట్‌ చేశారు. ఇక ఈ ట్వీట్లు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. సినిమా తీయడానికి వర్మకు మరో సబ్జెక్ట్‌ దొరికిందని కొందరు కామెంట్స్‌ చేస్తుండగా.. ‘మిడతల దండు’ అనే సినిమా తీయండి అంటూ మరికొందరు వర్మకు సూచనలిస్తున్నారు

Tags :
|
|

Advertisement