Advertisement

  • అమెజాన్ ప్రైమ్ లో 'వి' సినిమా ట్రైలర్ రిలీజ్

అమెజాన్ ప్రైమ్ లో 'వి' సినిమా ట్రైలర్ రిలీజ్

By: chandrasekar Thu, 27 Aug 2020 11:39 AM

అమెజాన్ ప్రైమ్ లో 'వి' సినిమా ట్రైలర్ రిలీజ్


అమెజాన్ ప్రైమ్‌లో టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని 25వ సినిమా ‘వి’ ని సెప్టెంబర్ 5న విడుదల చేయబోతున్నారు. వి సినిమా ట్రైలర్ బుధవారం విడుదల చేశారు. టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని 25వ సినిమా ‘వి’ సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా వి సినిమా ట్రైలర్ విడుదల చేశారు. అమెజాన్ ప్రైమ్‌లో చిత్ర యూనిట్ వి సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.

వైలెంట్ సినిమాలంటే ఇష్టమా నీకు.. ఎలా ఫినిష్ చేద్దాం.. మళ్లీ ఎక్స్‌పెక్టేషన్స్‌కు మ్యాచ్ అవ్వలేదన్న మాట రాకూడదంటూ నటుడు నాని చెప్పిన డైలాగ్స్ వి సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. శ్రీవెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు నిర్మాణ సారథ్యం వహించిన మోహ‌న‌కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శిరీష్, ల‌క్ష్మణ్ హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లు. నాని తో పాటు సుధీర్‌భాబు, అదితి రావు హైద‌రీ, నివేదా థామ‌స్ కీలక పాత్రలు పోషించారు. నాని గెటప్ కాస్త కొత్తగా కనిపించింది. విలన్ రోల్‌ ల అనిపిస్తుంది.

Tags :

Advertisement