Advertisement

నెటిజ‌న్ల‌తో అన‌సూయ‌ చిట్ చాట్

By: chandrasekar Thu, 23 July 2020 11:51 AM

నెటిజ‌న్ల‌తో అన‌సూయ‌ చిట్ చాట్


అందాల భామ అన‌సూయ జ‌బ‌ర్దస్త్ టీవీ షోతో మంచి పాపులారిటీ సంపాదించి ఆ త‌ర్వాత సిల్వ‌ర్‌స్క్రీన్‌పై మెరిసింది‌. సంప్ర‌దాయ‌క వ‌స్త్రధార‌ణ‌లో అయినా ట్రెండీ లుక్ లో క‌నిపించాల‌న్నా త‌న త‌ర్వాతే ఎవ‌రైనా అని ఫ్యాన్స్ అనుకునేలా చేసింది. అయితే గ్లామ‌ర‌స్ డ్రెస్సులు వేసిన‌పుడు కొన్నిసార్లు త‌న‌పై ట్రోల్స్ చేయ‌డంపై ఫ్యాన్స్ తో చేసిన చిట్ చాట్ లో అన‌సూయ స్పందించింది.

మంచి శ‌రీర‌సౌష్ఠ‌వం ఉంది. నేను గ్లామ‌ర‌స్‌గా క‌నిపించే డ్రెస్సులు వేసినపుడు కొంత‌మంది న‌న్ను ట్రోలింగ్ చేస్తుంటారు. ఒక‌వేళ అదే డ్రెస్సు మ‌రో అమ్మాయి ఎవ‌రైనా వేసుకుంటే ఆమెను ట్రోల్ చేయ‌రు. కార‌ణ‌మేంటంటే ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు. కొంద‌రు నెటిజ‌న్లకు భార్య‌, గ‌ర్ల్ ఫ్రెండ్ త‌ప్ప ఎవ‌రూ త‌మ‌కు అందుబాటులో ఉండ‌ర‌ని క‌నీస జ్ఞానం ఉన్న‌ప్ప‌టికీ ఆ అమ్మాయి త‌మ‌కు అందుబాటులో ఉంటుంద‌నుకుంటారు. పెళ్లికి మోడ్ర‌న్ డ్రెస్సుల‌కు సంబంధం లేద‌ని చెప్పింది.

తెలుగమ్మాయిలు వెస్ట‌ర్న్ లుక్ లో క‌నిపించడంపై ఓ నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ గ్లామ‌ర‌స్ గా, మోడ్ర‌న్ స్టైల్ లో క‌నిపించ‌డం నాకిష్టం. నువ్వు తెలుగ‌మ్మాయిగా క‌నిపించ‌వ‌ని, నార్తిండియ‌న్ లా ఉంటావ‌ని చాలా మంది న‌న్ను అడిగారు. అంటే తెలుగ‌మ్మాయిలు స్టైలిష్ గా ఉండ‌ర‌ని అర్థ‌మా? అని నెటిజ‌న్లకు స‌మాధాన‌మిచ్చింది అనసూయ‌.

Tags :
|

Advertisement