Advertisement

  • సంతోష్‌తో రెండు సినిమాలు...ప్రభాస్ సూచన మేరకు...యూవీ క్రియేషన్స్...

సంతోష్‌తో రెండు సినిమాలు...ప్రభాస్ సూచన మేరకు...యూవీ క్రియేషన్స్...

By: chandrasekar Sat, 11 July 2020 4:45 PM

సంతోష్‌తో రెండు సినిమాలు...ప్రభాస్ సూచన మేరకు...యూవీ క్రియేషన్స్...


‘వర్షం’ చిత్రం హీరో ప్రభాస్‌కు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా. ప్రభాస్ మార్కెట్ ఈ సినిమాతో అమాంతంగా పెరిగిపోయింది. ఈ సినిమాకు దివంగత దర్శకుడు శోభన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో శోభన్, ప్రభాస్ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అయితే, 2008లో శోభన్ గుండెపోటుతో అకాల మరణం చెందారు. అయినప్పటికీ శోభన్ ఫ్యామిలీతో తన అనుభంధాన్ని కొనసాగిస్తున్నారు ప్రభాస్.

శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ‘పేపర్ బోయ్’ సినిమాకు ప్రభాస్ ప్రచారం కల్పించారు. అంతకు ముందు సంతోష్ ‘గోల్కొండ హైస్కూల్’, ‘తను నేను’ చిత్రాల్లో నటించారు. ఇదిలా ఉంటే, సంతోష్ శోభన్ ఇప్పుడు యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో రెండు సినిమాలను అంగీరించాడని ఇండస్ట్రీ టాక్. ఈ రెండు సినిమాలకు సంతోష్ పేరును ప్రభాసే రికమండ్ చేశారని అంటున్నారు.

యూవీ క్రియేషన్స్ ప్రభాస్ సొంత బ్యానర్ అన్న సంగతి తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థకు ప్రభాస్ ఫ్రెండ్స్ వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రభాస్ సూచన మేరకు సంతోష్‌తో రెండు సినిమాలు నిర్మించేందుకు యూవీ క్రియేషన్స్ సన్నద్ధమవుతోందని టాక్. మరోవైపు, ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ఫస్ట్ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘రాధే శ్యామ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్.

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో స‌త్యరాజ్‌, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ క‌పూర్‌, జ‌గ‌ప‌తిబాబు, జ‌య‌రాం, స‌చిన్ ఖేడ్‌క‌ర్‌, భీనా బెన‌ర్జి, ముర‌ళి శ‌ర్మ, శాషా ఛ‌త్రి, ప్రియ‌ద‌ర్శి, రిద్దికుమార్‌, స‌త్యన్ త‌దిత‌రులు నటిస్తున్నారు.

Tags :

Advertisement