Advertisement

  • 2020లో సౌత్ టాప్‌-10 జాబితాను షేర్ చేసిన ట్విటర్‌ ఇండియా...

2020లో సౌత్ టాప్‌-10 జాబితాను షేర్ చేసిన ట్విటర్‌ ఇండియా...

By: chandrasekar Mon, 14 Dec 2020 8:37 PM

2020లో సౌత్ టాప్‌-10 జాబితాను షేర్ చేసిన ట్విటర్‌ ఇండియా...


‘మీరందరూ ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది 2020 లో ఎక్కువగా ట్వీట్ చేయబడిన దక్షిణ భారత సూపర్ స్టార్స్’ అంటూ ట్వీట్ చేసింది ట్విటర్‌ ఇండియా. సోషల్‌మీడియా సినీ స్టార్స్ గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎవరి పేరు మీద ఎక్కువ ట్వీట్స్ చేశారు అన్న విషయాలను ట్విటర్‌ ప్రకటిస్తుంది.

ఈ క్రమంలోనే ఈ కోవలోనే 2020 సంవత్సరానికి సంబంధించి దక్షిణ భారత సూపర్‌స్టార్స్‌ వీరేనంటూ టాప్‌-10 జాబితాను ట్విటర్‌ ఇండియా షేర్‌ చేసింది. ఆ జాబితాలో టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నెంబర్‌వన్‌ ప్లేస్ లొ౦ ఉండగా పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ రెండో ప్లేస్ లో ఉన్నాడు. తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌ మూడు, ఎన్టీఆర్‌ నాలుగు, సూర్య ఐదో స్థానాన్ని దక్కించుకున్నారు. దక్షిణాది హీరోయిన్‌ల విషయానికొస్తే మహానటి కీర్తి సురేష్‌ నెంబర్‌ వన్‌ స్థాన౦లో ఉండగా కాజల్‌, సమంత, రష్మిక మందన్నా, పూజా హెగ్డే తర్వాత స్థానాల్లో నిలిచారు.

Tags :
|
|

Advertisement