Advertisement

  • నేచురల్ స్టార్ నాని టక్ జగదీశ్ ఫస్ట్ లుక్ విడుదల...!

నేచురల్ స్టార్ నాని టక్ జగదీశ్ ఫస్ట్ లుక్ విడుదల...!

By: Anji Fri, 25 Dec 2020 4:47 PM

నేచురల్ స్టార్ నాని టక్ జగదీశ్ ఫస్ట్ లుక్ విడుదల...!

తెలుగు ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు నాని. భలే భలే మగాడివోయ్ చిత్రం తర్వాత నాని వరుస విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే.

కరోనా వైరస్ నేపథ్యంలో థియేటర్లు బంద్ అయిన విషయం తెలిసిందే. దాంతో పలు చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి.

నాని, సుధీర్ బాబు నటించిన ‘వి’ చిత్రం ఓటిటి లో రిలీజ్ అయి మంచి విజయం అందుకుంది. ఇక నాని నటిస్తోన్న 26వ చిత్రం ‘టక్ జగదీశ్’ నుంచి క్రిస్మస్ కానుక ఫస్ట్ లుక్ వచ్చేసింది.

ఈ సినిమాలో నాని ఫస్ట్‌లుక్‌ను క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని ఆ సినిమా యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే ఈ సినిమా నుంచి నాని లుక్‌ను విడుదల చేసింది.

ఫస్ట్ లుక్ లో నాని టక్ చేసుకొని భోజనం చేస్తున్నట్లు.. అదే సమయంలో వెనక నుంచి కత్తి తీస్తున్నట్లు నాని లుక్ ఉంది.

తాను నటించే ప్రతి చిత్రంలోనూ విభిన్నమైన పాత్రలో కనిపించే నాని ఈసారి కూడా మరో మాయచేయబోతున్నట్లు కనిపిస్తుంది. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్, జగపతిబాబు, రావు రమేశ్, నాజర్, నరేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ తో నిలిచిపోయిన షూటింగులు ప్రభుత్వ సడలింపులతో మళ్లీ ప్రారంభమైన విషయం తెలిసిందే.

శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు.

Tags :

Advertisement