Advertisement

  • గుణ‌శేఖ‌ర్ చిత్రానికి త్రివిక్ర‌మ్ డైలాగ్స్...

గుణ‌శేఖ‌ర్ చిత్రానికి త్రివిక్ర‌మ్ డైలాగ్స్...

By: chandrasekar Fri, 18 Dec 2020 5:56 PM

గుణ‌శేఖ‌ర్ చిత్రానికి త్రివిక్ర‌మ్ డైలాగ్స్...


డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ హిర‌ణ్య‌క‌శ్య‌ప చిత్రం తెర‌కెక్కించనున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు. వ‌చ్చే ఏడాది ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా కోసం త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో డైలాగ్స్ రాయించాల‌నుకుంటున్నాడ‌ట. ఈ చిత్రానికి క‌థ‌తోపాటు సంభాష‌ణ‌ల విష‌యంలో గుణ‌శేఖ‌ర్‌ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడ‌ని టాక్ న‌డుస్తోంది.

తొలినాళ్ల‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ రైట‌ర్ గా కెరీర్ ప్రారంభించారు. త్రివిక్ర‌మ్ డైలాగ్ రైట‌ర్ గా ప‌నిచేసిన ఆ తర్వాత‌ స్టార్ డైరెక్ట‌ర్ గా మారారు. ఈ మాట‌ల మాంత్రికుడు ప్ర‌స్తుతం క్లోజ్ గా ఉన్న వారి కోసం డైలాగ్స్ రాస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. గుణ‌శేఖ‌ర్ రానా ద‌గ్గుబాటితో హిర‌ణ్య క‌శ్య‌ప చిత్రం చేస్తున్న‌ట్టు గ‌తంలోనే ప్ర‌క‌టించాడు.

Tags :

Advertisement