Advertisement

  • మరొక కొత్త సినిమాకు క్లాప్ కొట్టిన టాలీవుడ్ యువ నటుడు సత్యదేవ్

మరొక కొత్త సినిమాకు క్లాప్ కొట్టిన టాలీవుడ్ యువ నటుడు సత్యదేవ్

By: Sankar Mon, 19 Oct 2020 11:18 AM

మరొక కొత్త సినిమాకు క్లాప్ కొట్టిన టాలీవుడ్ యువ నటుడు సత్యదేవ్


ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మంచి నటులలో సత్యదేవ్ ఒకరు ..కంటెంట్ ఉన్న క‌థ‌ల్ని ఎంచుకుంటూ త‌నదైన శైలిలో న‌టిస్తూ ప్రేక్ష‌కాభిమానం సొంతం చేసుకుంటున్న స‌త్యదేవ్. త్వరలో కొత్త సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

సత్యదేవ్ నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.. 47 డేస్ తో పాటు మరికొన్ని సినిమాలను కూడా ఈ లాక్ డౌన్ టైమ్ లోనే సత్యదేవ్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఈ సమయంలోనే మరో కొత్త సినిమాకు సత్యదేవ్ క్లాప్ కొట్టాడు. నేడు లాంచనంగా ప్రారంభం అయిన తిమ్మరుసు సినిమాలో సత్యదేవ్ హీరోగా నటించబోతున్నాడు.తిమ్మరుసు టైటిల్ కు అసైన్ మెంట్ వాలి అనేది ట్యాగ్ లైన్.

విభిన్నమైన కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సత్యదేవ్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందట. ఈనెల 21 నుండి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు.

Tags :

Advertisement