Advertisement

  • "లక్ష్య" టైటిల్ తో విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్న యువ హీరో

"లక్ష్య" టైటిల్ తో విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్న యువ హీరో

By: Sankar Mon, 30 Nov 2020 5:59 PM

"లక్ష్య" టైటిల్ తో విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్న యువ హీరో


టాలీవుడ్ లో నిలదొక్కుకునేందుకు యువ హీరో నాగ శౌర్య తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు...చలో సినిమాతో మంచి హిట్ కొట్టిన ఈ కుర్ర హీరో ప్రస్తుతం మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే పనిలో ఉన్నాడు...దీనికోసం తన బాడీని పూర్తిగా మార్చుకుని హల్క్ లాగ తయారు అయ్యాడు...తాజాగా శౌర్య నుంచి వస్తున్న కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ ఈ రోజు సాయంత్రం చేసారు... సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు లక్ష్య అనే టైటిల్ పెట్టారు...

ఈ పోస్ట‌ర్‌లో నాగ‌శౌర్య సూపర్ ఫిట్ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. సోనాలి నారంగ్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై ప్ర‌ముఖ నిర్మాత‌లు నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్ర‌లో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు.

నాగ‌శౌర్య కెరీర్‌లో 20వ చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ నుండి ఇప్ప‌టికే విడుద‌ల‌చేసిన స్ట‌న్నింగ్‌ ఫస్ట్‌లుక్ అంద‌రినీ థ్రిల్ చేసింది. ‘ది గేమ్ విల్ నెవ‌ర్ బీ ద సేమ్’ అంటూ ఎయిట్‌ ప్యాక్ బాడీతో చేతిలో బాణం ప‌ట్టుకుని వారియ‌ర్ పోజ్ లో నాగ‌శౌర్య నిల్చొని ఉన్న లుక్ సూప‌ర్బ్ అని అంద‌రూ అప్రి‌షియేట్ చేశారు. ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

Tags :

Advertisement