Advertisement

బ్యాక్ టూ హోమ్ అంటున్న కింగ్ నాగార్జున...

By: Sankar Fri, 06 Nov 2020 11:02 AM

బ్యాక్ టూ హోమ్ అంటున్న కింగ్ నాగార్జున...


‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ నిమిత్తం మనాలిలో ఉన్న నాగార్జున హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు. ఆరు నెలల గ్యాప్ తర్వాత ముఖానికి మేకప్ వేసుకొని ‘వైల్డ్ డాగ్’ ఫస్ట్ పార్ట్ దిగ్విజయంగా పూర్తిచేశాడు నాగ్.

ఈ మూవీలో ఎన్ఐఎ ఆఫీసర్ గా డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో అహిషోర్ సోల్‌మన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలు. కిరణ్ కుమార్ మాటలు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తైన ఈ చిత్రంలో నాగార్జునకు జోడిగా దియా మీర్జా కథానాయికగా నటిస్తోంది.

సయామీ ఖేర్ మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. నిజ జీవిత ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని వైల్డ్‌ డాగ్ సినిమాను తీర్చిదిద్దుతున్నాడు దర్శకుడు. అందమైన హిమాలయాలు, టాలెంటెడ్ టీం ను వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందంటూ ఈ సందర్భంగా నాగ్ ట్వీట్ చేశారు.

Tags :

Advertisement