Advertisement

  • ఇస్మార్ట్ సోహెల్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన హాస్యబ్రహ్మ బ్రహ్మానందం..

ఇస్మార్ట్ సోహెల్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన హాస్యబ్రహ్మ బ్రహ్మానందం..

By: Sankar Tue, 22 Dec 2020 5:24 PM

ఇస్మార్ట్ సోహెల్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన హాస్యబ్రహ్మ బ్రహ్మానందం..


బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు గత ఆదివారం రోజు ముగిసింది..105 రోజులపాటు జరిగిన ఆ షోలో అభిజీత్ విన్నర్ గా నిలవగా , అఖిల్ రెండో స్థానంలో నిలిచాడు..ఇక సోహెల్ 25 లక్షల రుపాయల ఆఫర్ తీసుకోని మూడోస్థానంతో తనకు తానుగా బయటకు వచ్చాడు...అయితే ఈ బిగ్ బాస్ వలన ఎక్కువ లాబాపొందింది అంటే మాత్రం సోహెల్ ఏ అని చెప్పవచ్చు..

15 వారాలు ఇంట్లో ఉన్నందుకు వారానికి 2 లక్షలకు పైగానే అందుకున్నాడు సోహెల్. అంటే అక్కడ 30 లక్షలు వచ్చాయన్నమాట. అలా దాదాపు 60 లక్షల వరకు బిగ్ బాస్ నుంచి సంపాదించుకున్నాడు ఈ నటుడు. ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత మరిన్ని అవకాశాలు కూడా ఈయనకు వస్తున్నాయి. ఇప్పటికే ఈయన హీరోగా నటించే సినిమాలో తనకు చిన్న పాత్ర ఇవ్వాలంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పాడు. నా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వస్తారా సర్ అని అడిగితే.. ఎందుకు చిన్న పాత్ర కూడా చేస్తానంటూ మాటిచ్చాడు చిరంజీవి..

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ కూడా వచ్చింది సోహెల్‌కు. లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం కూడా సోహెల్‌కు ఆఫర్ ఇచ్చాడు. షో చూసిన తర్వాత మనోడి ఆటిట్యూడ్ కు ఫిదా అయిపోయిన బ్రహ్మి.. కాల్ చేసి నీ సినిమాలో నేను ఫ్రీగా నటిస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు. ఈ విషయం సోహెల్ చెప్పాడు. దాంతో లెజెండరీ కమెడియన్ కూడా పారితోషికం లేకుండా నటించే అదృష్టం దక్కించుకున్నాడు సోహెల్

Tags :

Advertisement