Advertisement

  • యూట్యూబ్ లో దూసుకుపోతున్న శ్రియ గమనం ట్రైలర్

యూట్యూబ్ లో దూసుకుపోతున్న శ్రియ గమనం ట్రైలర్

By: Sankar Thu, 19 Nov 2020 10:39 PM

యూట్యూబ్ లో దూసుకుపోతున్న శ్రియ గమనం ట్రైలర్


టాలీవుడ్ సీనియర్ భామ శ్రియాశ‌ర‌ణ్ లీడ్ రోల్ ‌లో న‌టిస్తోన్న ప్రాజెక్టు గ‌మ‌నం. పాన్ ఇండియా క‌థాంశంతో రియ‌ల్ లైఫ్ డ్రామాగా తెర‌కెక్క‌తున్న ఈ మూవీని సుజ‌నారావు డైరెక్ట్ చేస్తున్నారు.

న‌వంబ‌ర్ 11న ఈ చిత్ర ట్రైల‌ర్ ను ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంఛ్ చేసిన విష‌యం తెలిసిందే. మూడు భిన్న‌మైన స్టోరీల ‌చుట్టూ తిరిగే ఈ సినిమా ట్రైల‌ర్ కు అద్బుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. తెలుగు, త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో విడుదలైన ట్రైల‌ర్ కు 11 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి. ఈ విష‌యాన్ని బీఏ రాజు ట్విట‌ర్ ద్వారా షేర్ చేసుకున్నారు.

ఈ చిత్రంలో శ్రియ చెవుడు క‌లిగిన గృహిణి పాత్ర‌లో న‌టిస్తోంది. మ‌రోవైపు నిత్య‌మీనన్ గాయ‌ని శైల‌పుత్రి దేవి పాత్ర‌లో న‌టిస్తోంది. ప్రియాంకా జ‌వాల్క‌ర్, శివకందుకూరి ప్రేమికులుగా క‌నిపించనున్నారు. బిత్తిరి స‌త్తి కామెడీతో అల‌రించ‌నున్నాడు

Tags :
|

Advertisement