Advertisement

సినిమా ప్రేమికులకు చేదు దసరా...!

By: Anji Sun, 25 Oct 2020 7:12 PM

సినిమా ప్రేమికులకు చేదు దసరా...!

సినిమా ప్రేమికులకు ఈ ఏడాది దసరా చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఎందుకంటే దసరా అంటే ప్రతి ఏడాాది నాలుగైదు అగ్ర హీరోల సినిమాలు కొదమ సింహాల్లా బాక్సాఫీస్ బరిలో నిలిచేవి. అభిమానులు కూడా తమ హీరో సినిమా పండక్కి వస్తుందంటే ఇంకో రేంజ్‌లో ఏర్పాట్లు చేశారు.

కానీ ఈ ఏడాది కరోనా కారణంగా థియేటర్లు బోసిపోయాయి. ఆరు, ఏడు నెలలుగా ప్రదర్శనలు ఆగిపోయాయి. ఇప్పుడు థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా..ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చే పరిస్థితులు లేవు.


కలెక్షన్ల గురించి గొప్పలు చెప్పుకోవడాలు లేవు…కంటెంట్ గురించి ప్రస్తావనే లేదు. ఇంట్లో ఉండి పాత సినిమాలనే ఫోన్లలో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే ఏడాది దసరా వరకు అన్ని పరిస్థితులు సర్దుకుని..ఈ కరోనా మహమ్మారి తరిమికొట్టి…మూతులకు ఉన్న మాస్కులను విసిరేసి… థియేటర్ల ముందు కటౌట్లు లెగిసేలా చూడాలని అమ్మవారిని కోరుకుందాం.

Tags :

Advertisement