Advertisement

  • ఆకాశమే నీ హద్దురా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన హీరో విజయ్

ఆకాశమే నీ హద్దురా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన హీరో విజయ్

By: Sankar Tue, 17 Nov 2020 1:57 PM

ఆకాశమే నీ హద్దురా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన హీరో విజయ్


సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విమర్శలు ప్రశంసలు అందుకుంటుంది. భారతదేశంలోని మొట్టమొదటి బడ్జెట్ విమానయాన సంస్థ వ్యవస్థాపకులు జీఆర్ గోపినాథ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది...

లేడీ డైరెక్టర్ సుధ కొంగరు దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య నటన అద్భుతమని చెప్పాలి హీరోయిన్ గా మలయాళీ ముద్దుగుమ్మ అపర్ణ బాలమురళి నటించారు. కీలక పాత్రలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటించారు. ఇక ఈ సినిమా పై క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసారు, సినిమా చూసిన విజయ్ చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించాడు.

సినిమాను నేను పెద్ద గ్యాంగ్ తో చూశాను. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఏకంగా ఏడ్చేశారు. సినిమా చూసిన తర్వాత తెలియని ఆవేశం కలిగింది. సినిమా మంచి సందేశాన్ని ఇచ్చింది. సూర్య అద్బుతమైన నటన కనబర్చారు. ఆయన నటన చూసిన తర్వాత ఆయన పై ఇష్టం మరింత పెరిగింది. హీరోయిన్ అపర్ణను చూసి ఇలాంటి అద్బుతమైన నటిని సుధ గారు ఎక్కడ పట్టారు అనిపించింది. దర్శకురాలు సుధ కొంగర పై ప్రశంసలు చేస్తూ నేను మీతో కలిసి పని చేస్తాను". అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.

Tags :
|

Advertisement