Advertisement

పుట్టిన రోజు శుభాకాంక్షలు... శ్రీను వైట్ల

By: Anji Thu, 24 Sept 2020 08:31 AM

పుట్టిన రోజు శుభాకాంక్షలు... శ్రీను వైట్ల

టాలీవుడ్ లో 'దూకుడు' డైరెక్టర్ పుట్టిన రోజు ఈ రోజు. ఈ డైరెక్టర్ కామెడీనే ప్రధానంగా చేసుకొని సినిమాలు తెరకెక్కించడం శ్రీను వైట్ల స్టైల్. 'దూకుడు' సినిమా వరకు తిరుగులేని దర్సకుడిగా రాణించారు శ్రీను వైట్ల. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లు అయ్యియి. దాంతో శ్రీను వైట్ల కొంత గ్యాప్ తీసుకున్నారు. తిరిగి ఫామ్ లోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటు సక్సెస్ ఫుల్ దర్శకునిగా తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న మిస్టర్ శ్రీను వైట్ల పుట్టిన రోజు నేడు.

1972 సెప్టెంబర్ 24న ఈస్ట్ గోదావరి జిల్లాలోని కందులపాలెం గ్రామంలో జన్మించిన శ్రీనువైట్ల సినిమా మీదున్న ఫ్యాషన్ తో చెన్నై చేరాడు. కథలు రాయడం, నాటకాలు వేయడం ఇలాంటివి ఏవీ లేవు. కానీ సినిమాల ప్రభావం ఎక్కువగా ఉండేది. దీంతో రూ.1400 జేబులో పెట్టుకుని మద్రాసు వెళ్లారు. రైల్లో పరిచయమైన కుర్రాడు ఇచ్చిన అడ్రస్‌తో అతని స్నేహితుడిని కలిసి రెండు రోజులు పాటు అతని గదిలో ఉండేందుకు అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత కృష్ణవంశీతో పరిచయం, సినిమా అవకాశాల కోసం తిరగడం షరా మామూలు. ‘నక్షత్ర పోరాటం’, ‘అమ్మదొంగా’ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు.

తొలి సినిమాతోనే నీకోసం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుని కమర్షియల్‌గా పర్వాలేదనిపించుకున్నారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన శ్రీనువైట్ల కెరియర్ లో ఆనందం, దూకుడు, డీ, రెడీ, వెంకీ వంటి సినిమాలు బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచాయి. ప్రస్తుతం ఢీ 2 ప్లాన్ చేస్తున్నాడు శ్రీనువైట్ల . దాంతోపాటు దూకుడు 2 కూడా చేయాలనీ చూస్తున్నాడు శ్రీను వైట్ల .

Tags :

Advertisement