Advertisement

  • రాజకీయాల్లోకి రానున్న మరో స్టార్ హీరోయిన్...!

రాజకీయాల్లోకి రానున్న మరో స్టార్ హీరోయిన్...!

By: Anji Tue, 08 Dec 2020 12:01 PM

రాజకీయాల్లోకి రానున్న మరో స్టార్ హీరోయిన్...!

ప్రస్తుతం ఇండస్ట్రీ లో రాశిఖన్నా బిజీ హీరోయిన్ అయ్యింది..వరుస ఛాన్సులు అమ్మడిని బిజీ హీరోయిన్ ను చేసేస్తున్నాయి.

వెంకిమామ , ప్రతి రోజు పండగే చిత్రాలతో తెలుగులో సూపర్ హిట్స్ అందుకున్న ఈమె..ప్రస్తుతం తమిళ్ లో అర‌ణ్మ‌నై 3 సినిమాలో న‌టిస్తోంది.

ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో బాగా బిజీగా ఉన్న ఈ ముప్పై ఏళ్ల ముద్దుగుమ్మకు భవిష్యత్తులో పాలిటిక్స్‌లోకి వచ్చే ఆలోచన ఉందట. తనకు చిన్నప్పుడు ఐఏఎస్‌ ఆఫీసర్‌ అవ్వాలని ఉండేదట. అయితే అనుకోకుండా యాక్ట్రెస్ అయ్యిందట.

ప్రస్తుతం తాను ఐఏఎస్‌ ఆఫీసర్‌ ను కాలేనని కానీ ఫ్యూచర్ లో మాత్రం పక్కా తన పొలిటికల్ ఎంట్రీ ఉంటుందంటోంది ఈ బొద్దుగుమ్మ. అంతేకాదు కుదురితే ఒక ఎన్జీవో కూడా ప్రారంభినంటోంది.

ప్రజల సమస్యలు తెలుసుకుని వారిని అండగా ఉండడం తనకు ఇష్టమంటోంది. పాలిటిక్స్ లో జాయిన్ అవుతాని కానీ పాలిటిక్స్ చేయడం తనకు రాదని.. ప్రజాసేవే తనకు తెలుసని చెబుతోంది రాశీఖన్నా.

Tags :

Advertisement