Advertisement

  • ఇండియా వైడ్ గా మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో మూడో స్థానంలో నిలిచిన రౌడీ హీరో

ఇండియా వైడ్ గా మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో మూడో స్థానంలో నిలిచిన రౌడీ హీరో

By: Sankar Sun, 23 Aug 2020 3:35 PM

ఇండియా వైడ్ గా మోస్ట్  డిజైరబుల్ మెన్ లిస్ట్ లో మూడో స్థానంలో నిలిచిన రౌడీ హీరో


టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ మరోక రికార్డు సాధించాడు..ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోగా పేరు సంపాదించిన విజయ్ దేవరకొండ తాజాగా ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యాడు..ప్రముఖ మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన 'మోస్ట్ డిజైరబుల్ మెన్ ఇన్ ఇండియా' లిస్టులో టాలీవుడ్ నుంచి నేనొక్కడినే అంటూ టాప్ 10లో నిలిచారు.

ఆన్‌లైన్‌ ద్వారా 'మోస్ట్ డిజైరబుల్ మెన్ ఇన్ ఇండియా' పోటీని నిర్వహించింది టైమ్స్ మీడియా. ఇందులో సినీ స్టార్స్, క్రికెట్ స్టార్స్ లకు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత టాప్ 50 లిస్టు ప్రకటించగా టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మూడో స్థానంలో నిలిచారు. ముఖ్యంగా టాప్ 10 లిస్టు చూస్తే టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ ఒక్కరే అందులో స్థానం సంపాదించారు. బాలీవుడ్ హీరోలు షాహిద్ కపూర్, రణవీర్ సింగ్‌లు మొదటి, రెండవ స్థానాల్లో చోటు దక్కించుకోగా ఆ తరువాత విజయ్ దేవరకొండనే నిలవడం విశేషం.

ఇకపోతే ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫైటర్' మూవీలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ఆయన సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :
|
|

Advertisement