Advertisement

యంగ్ టాలెంట్‌కి ఇదో సువర్ణావకాశం

By: chandrasekar Sat, 27 June 2020 3:00 PM

యంగ్ టాలెంట్‌కి ఇదో సువర్ణావకాశం


సినిమా, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్, స్క్రిప్ట్ ఇలా ఏదైనా మీదగ్గర రెడీగా ఉంటె ప్రముఖ నటుడు రాజా రవీంద్ర నంబర్‌ని సంప్రదిస్తే మీ కల నెరవేరినట్టే. యంగ్ టాలెంట్‌కి ఇదో సువర్ణావకాశం. నటుడిగానే కాకుండా రవితేజ, రాజ్ తరుణ్, మంచు విష్ణు లాంటి ఎంతో మంది హీరోలకు మేనేజర్‌గా పనిచేసిన, చేస్తున్న రాజా రవీంద్ర కొత్తగా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లోకి అడుగుపెడుతున్నారు.

దీనిలో భాగంగా కంటెంట్ క్రియేటర్స్‌కి అవకాశం కల్పిస్తూ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. రెడీగా ఉన్న కంటెంట్ వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్, వెబ్ ఫిల్మ్, ఇలా ఏదైనా ఫ్రెష్ కంటెంట్ మీ దగ్గర ఉంటే 9866661111 నంబర్‌కి సంప్రదించాలని రాజా రవీంద్ర వీడియో మెసేజ్ ఇచ్చారు. హారర్, థ్రిల్లర్, సస్పెన్స్ ఇలా ఏ జోనర్‌కి సంబంధించిన కంటెంట్ ఉన్నా ఈ నంబర్‌కి సంప్రదించవచ్చు. అయితే ఈ నెంబర్‌కి కేవలం వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ కాని వీడియో మెసేజ్, సాధారణ మెసేజ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. అనంతరం తన టీం సభ్యులు సంప్రదిస్తారని తెలియజేశారు రాజా రవీంద్ర.

ఇక రిలీజ్‌కి రెడీగా ఉన్న కంటెంట్‌ని మాత్రమే కాకుండా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ దశలో ఉన్న వాళ్లు కూడా సంప్రదించవచ్చు. కంటెంట్ బాగుంటే వాటిని కూడా తీసుకుంటాం అని అన్నారు రాజా రవీంద్ర. ఇక షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న కంటెంట్‌ను కూడా తామే కంప్లీట్ చేస్తామంటున్నారు.

వాళ్లకు సంబంధించిన కంటెంట్ దాని వివరాలను వాట్సాప్‌లో పంపిస్తే రాజా రవీంద్ర టీం సభ్యులు కంటెంట్ క్రియేటర్స్ టచ్‌లోకి వచ్చి అన్ని విషయాలను తెలియజేస్తారు. అలాగే కొత్త కథలు చెప్పాలనుకునేవాళ్లు ఈ నెంబర్‌ని సంప్రదించవచ్చని, మంచి కథ, వెబ్ సిరీస్, కంటెంట్ ఉంటే ‌వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాలని రాజా రవీంద్ర కోరారు రాజా రవీంద్ర.

Tags :
|
|

Advertisement