Advertisement

  • ప్రగతి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తోన్నవీడియో సోషల్ మీడియాలో వైరల్

ప్రగతి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తోన్నవీడియో సోషల్ మీడియాలో వైరల్

By: chandrasekar Fri, 24 July 2020 3:51 PM

ప్రగతి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తోన్నవీడియో సోషల్ మీడియాలో వైరల్


సినీ ఇండస్ట్రీకి చెందిన కార్యకలపాలన్ని మహమ్మారి కరోనా కారణంగా ఎక్కడికి అక్కడే ఆగిపోయాయి. దీనికితోడు లాక్ కారణంగా సినీ నటులు, సాంకేతిక నిపుణులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ ఖాళీ సమయంలో తోచిన పని చేసుకుంటూ దానికి సంబందించిన వీడియోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రముఖ క్యారక్టర్ నటి ప్రగతి గతంలో కొన్ని డ్యాన్స్ వీడియోలను ఇన్ స్టాగ్రామ్ పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో ఓ తమిళ మాస్ పాటకు ప్రగతి అదిరిపోయే స్టెప్స్ వేస్తూ కేక పెట్టించేసింది. తమిళ స్టార్ విజయ్ తాజా సినిమా మాస్టర్ లోని ఓ మాస్ పాటకు లుంగీ కట్టి తన కొడుకుతో కలిసి మాస్‌ డ్యాన్స్‌ చేస్తూ ఊపేసింది. దీంతో అప్పట్లో ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

తాజాగా ప్రగతి తన జిమ్‌లో వర్కౌట్స్ చేస్తోన్న మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్’గా మారింది. ఆ వీడియోలో ప్రగతి వైట్ టాప్ వేసుకుని, తెగ కష్టపడుతూ జిమ్ డ్రెస్‌లో అదరగొడుతోంది. ఇది చూసిన నెటిజన్స్ వావ్ ప్రగతి మేడమ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ ఏజ్‌లో వర్కౌట్స్ చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారని తమ అభిమాన నటిని మెచ్చుకుంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. నటి ప్రగతి తెలుగు సినిమాల్లో ముఖ్యంగా హీరో, హీరోయిన్ల తల్లి పాత్రలో ఆమె తనదైన నటనతో కట్టిపడేస్తుంది. అమ్మ, వదిన పాత్రలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది.

Tags :

Advertisement